టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్ ఖాన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. గత కొంతకాలంగా బాలీవుడ్ నటి సాగరిక ఘటెతో ప్రేమాయణం సాగిస్తున్నసాగిస్తున్న జహీర్ త్వరలోనే ఆమె వివాహమాడనున్నాడు. ఆమెతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ట్విటర్ ద్వారా ధ్రువీకరించాడు. ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపిస్తున్న సాగరికతో కలసి ఉన్న ఫొటోను జహీర్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతానికి 38 ఏళ్ల జహీర్ ఐపీఎల్లో ఢిల్లీ జట్టు కెప్టెన్ వ్యవహరిస్తున్నాడు.