//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వన్డేల్లో రికార్డు స్థాయిలో 300వ మ్యాచ్‌ లో యువరాజ్‌సింగ్

Category : sports

అద్భుత పోరాటపటిమకు పేరొందిన యువరాజ్‌సింగ్ క్రికెట్ చరిత్రలో నేడో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 300వ మ్యాచ్‌కు అడుగుదూరంలో నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే సెమీస్ ద్వారా యువీ తన వన్డే కెరీర్‌లో ఈ ట్రిపుల్ సెంచరీ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. 

దీంతో వన్డేల్లో 300 మ్యాచ్‌లు ఆడిన భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఐదవవానిగా నిలిచారు. 2000లో చాంపియన్స్ ట్రోఫీ లోని తన అంతర్జాతీయ క్రికెట్ ను ప్రారంభించడం గమనార్హం.  సచిన్ టెండూల్కర్ (463), రాహుల్ ద్రావిడ్ (340), మొహమ్మద్ అజహరుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (308) ఇది వరలో 300 ఒన్డేలను అధిగమించారు.  "నా జీవితంలో ఇది గొప్ప విజయమే. నేను ఆడటం ప్రారంభించినప్పుడు భారత్ టీం లో ఒక సారి ఆడితే చాలనుకున్నాను" అని వినయంగా తన రికార్డు గురించి చెప్పారు. 

రికార్డు సృష్టిస్తున్న 300వ ఆటకు ముందు మేటి క్రీడాకారుడు హరిభజన్ సింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా లో ఒక వీడియో  ను పోస్ట్ చేశారు. "స్నేహితులారా, నేడు నేను  ఒక ప్రత్యేక వ్యక్తి గురించి, నా హృదయానికి దగ్గరైన, నా స్నేహితుడు, నా సోదరుడు యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతున్నాను" అని  వీడియో లో పేర్కొన్నారు. 

"నేడు యువ  భారత దేశం కోసం 300వ ఆట ఆడుతున్నాడు. ఇది చాల గొప్ప విజయం. పలు సంవత్సరాలుగా పలు ఆటలు ఆడుతున్న యువకు శుభాకాంక్షలు. మేము యువకులంగా ఉన్నప్పుడు నేను 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడగలనని ఎప్పుడూ అనుకోలేదు. అట్లాగే యువ 300 వన్ డే లు ఆడాతారని అనుకోలేదు. దేవుడు నిజంగా మా పట్ల చాల ఉదారంగా వ్యవహరించారు. మా స్నేహం కూడా అట్లాగే ఉంది" అంటూ పేర్కొన్నారు. 

బరిలోకి దిగితే ప్రత్యర్థి ఎవరైనా కడదాకా పోరాడే నైజం ఈ పంజాబీ పుత్తర్ సొంతం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు దక్కిన మేలిమి ముత్యం. బంతిని బలంగా బాదడంలో ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అతనికి ఎవరూ సాటిరారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కవోని పట్టుదలతో జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలు ఎన్నో. తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించే యువీ ఇప్పుడు సరికొత్త ఫీట్‌కు చేరువయ్యాడు.