Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడి అల్టిమేటం ....టెన్షన్ లో జగన్

Category : state politics

జగన్ పార్టీ కి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి . ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇంత కాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ స్థాపించిన పార్టీ అని చాలా మంది భావిస్తున్నా కానీ ఆ పార్టీ ని స్థాపించిన శివ కుమార్ ఇప్పుడు తెరమీదకు వచ్చారు. జగన్ కు అల్టిమేటం ఇచ్చారు. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్ ను టెన్షన్ పెడుతున్నారు. జగన్ పై న్యాయపోరాటం చేస్తానని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇంతకీ అసలు కథ ఏమిటి అంటే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...ఈ పార్టీని స్థాపించింది శివకుమార్ అనే రాజశేఖర్ రెడ్డి అభిమాని. ఈ పార్టీ 2009లో ఏర్పాటైంది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం తో శివ కుమార్ ఈ పార్టీ ని స్థాపించి ఎలాంటి షరతులు లేకుండా తదుపరి కాలంలో పార్టీ ను జగన్ కు అప్పగించారు. ఇక వైసీపీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. వాస్తవానికి ఈ పార్టీని స్థాపించిన కొలిశెట్టి శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్ మీద అభిమానంతో ఆయనకు అప్పగించారు. అందువల్లే శివకుమార్‌ను దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పేర్కొంటారు. వైసీపీ ని స్థాపించిన శివకుమార్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పరిమితం అవడంతో అక్కడ పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో శివకుమార్ చేసిన ఒక ప్రకటన జగన్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ హోదా లో శివకుమార్ ప్రకటన చేశారు. అలా శివకుమార్ తన ఆదేశం లేకుండా తనకు నచ్చని పార్టీ కి మద్దతు అని చెప్పటం పత్రికా ప్రకటన ఇవ్వడం, తన ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండటంతో ఆగ్రహించిన జగన్ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు.

ఇక ఈ బహిష్కరణపై శివ కుమార్ కూడా స్పందించారు. దేశ చరిత్రలో ఓ పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఇక ఈసారి ఆయన జగన్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ‘‘నాపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేయాలి. లేదంటే వైసీపీ నుంచి బయటకు పోవాలి’’ అని శివకుమార్‌ అల్టిమేటం జారీ చేశారు. తానూ పెట్టిన పార్టీ నుండి పొమ్మనటానికి మీరెవరు అంటూ ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు. ఇక పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన తన పార్టీ కోసంన్యాయ పోరాటానికి శివకుమార్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఆయన విడుదల చేసిన ప్రకటన ‘‘బహిష్కరణ వేటు ఎత్తివేయాలి. లేకుంటే జగన్‌ సొంత పార్టీ పెట్టుకోవాలి అని ఫైర్ అయిన శివకుమార్ నేను నా రాజకీయ జీవితాన్ని 1998లో ప్రారంభించాను. నేను 2009లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి ఏ షరతులూ లేకుండా జగన్‌కి అప్పగించాను. .ఇక వైఎస్‌ఆర్‌ను తిట్టిన కేసీఆర్‌కు మీరు ఎందుకు సపోర్టు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని అవమానించిన వాళ్లందరూ ఈ రోజు పార్టీలో కొనసాగుతున్నారు. త్వరలో ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపడతా’’ అని పేర్కొన్నారు. దీంతో జగన్‌కు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది.

Related News