//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పులివెందులలో ఓటమి చవిచూసిన వైసీపీ ....!

Category : politics state

పులివెందుల కడప జిల్లాలో ఈ పేరుకి ఘనమైన చరిత్ర వుంది. మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏళ్లతరబడి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. ఇక్కడినుండే పోటీ చేసి రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి రెండు ధపాలుగా ముఖ్యమంత్రి గా భాద్యతలను నిర్వహించాడు.

కాగా , ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తరతరాలుగా ఇక్కడ వైఎస్సార్ కుటుంబానికి ఎదురులేకుండా పోయింది, వారు చెప్పిందే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రోజులుమారాయి ...దీనితో ఇప్పుడు వైసీపీ కి ఏంటో పట్టున్న పులివెందులలో వైసీపీ ఓటమిని చవిచూసింది.

ఇక అసలు విషయం ఏమిటంటే .....ఈయూతో కూటమి కట్టి ఆర్టీసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల డిపోలో పరాభవం ఎదురైంది. ఎన్‌ఎంయూపై పోటీకి దిగిన వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ 47 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఎంయూకు 237 ఓట్లు రాగా, ఈయూ-వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ కూటమికి 183 ఓట్లు వచ్చాయి. రీజియన్ స్థాయిలో ఎన్ఎంయూకు 234 ఓట్లు, ఈయూ-వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌కు 187 ఓట్లు వచ్చాయి.

Related News