//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివేకా లేఖపై వైసీపీ అనుమానాలు .. ప్రాణం పోతుంటే లెటర్ రాశారా ?

Category : politics state

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను ఉలికిపాటుకు గురి చేసింది . సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్యను రాజకీయ హత్యగా భావిస్తున్నారు వైసీపీ నేతలు. తన చిన్నాన్నను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని - నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనిపై జగన్ డిమాండ్ కు ముందే అధికార టీడీపీ వివేకా హత్యను రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ ఎదురు దాడికి దిగింది. మంత్రులు - చివరకు సీఎం నారా చంద్రబాబునాయుడు సైతం తమదైన వాదనను వినిపించారు.హత్యపై దర్యాప్తుకు సిట్ ను వేసింది ఏపీ ప్రభుత్వం .ఈ క్రమంలో వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ కొత్త చర్చకు తెరతీసింది .

అసలు తనపై గొడ్డలితో కిరాతకంగా దాడి జరిగితే... స్వయంగా వివేకా లెటర్ ఎలా లేఖ రాశారన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వైసీపీ శ్రేణుల నుండి వినిపిస్తోంది.వివేకా రాసినట్టుగా చెబుతున్న సదరు లేఖలో వివేకా ఏం రాశారన్న విషయంలోకి వస్తే... *నా డ్రైవరు... నేను డ్యూటీకి తొందరగా నమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టొద్దు... ఇట్లు వివేకానందరెడ్డి* అని ఆ లేఖలో ఉన్నట్లుగా ఇటు పోలీసులతో పాటు అటు టీడీపీ సర్కారు చెబుతోంది. అయితే ఈ లేఖపై జగన్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రాణం పోతుంటే లేఖ రాయటం సాధ్యమా అని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే చంపి బాత్ రూమ్ లో పడేసిన హంతకులు లేఖ రాసే టైం ఇచ్చారా ? లేకా కేసు తప్పు దారి పట్టించే క్రమంలో వారే లేఖ రాయించారా అన్న అనుమానాలు సైతం లేకపోలేదు .

రాత్రి వేళ... ఇంటిలో ఒంటరిగా ఉన్న తనపై దుండగులు దాడికి దిగితే... దాడి తర్వాత వారు వెళ్లిపోయాక వివేకా లేఖ రాసినట్టుగా చెప్తున్న వాదన లో వాస్తవం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. . అసలు వివేకాపై దాడి చేసిన దుండగులు ఆయన చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే... డెడ్ బాడీని బాత్ రూంలోకి లాక్కెళ్లి... దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారన్న అభిప్రాయం వైసీపీ నేతల నుండి వ్యక్తం అవుతుంది. ఒకవేళ వివేకాపై దాడి చేసిన నిందితులు ఆయన మరణించకుండానే వెళ్లిపోయినా... గొడ్డలితో తన శరీరంపై తీవ్ర గాయాలు అయితే... ప్రాణం పోయే స్థితిలో వివేకా లేఖ రాయటం సాధ్యం కాదు అన్నది వైసీపీ వాదన .