//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వామపక్షాల బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు..!

Category : politics

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈనెల 8న వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగ్గరాజపట్నం, విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్యాక్టరీ సహా విభజనచట్టం ప్రకారం రావాల్సిన అన్ని అంశాలపైన తీరని అన్యాయం జరిగిందని ఈ క్రమంలో ఏ పార్టీ ఎలాంటి ఆందోళన చేపట్టినా వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుందని పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

దీనికి అనుగుణంగానే వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది.విభజన హామీల అమలు కోసం నాలుగేళ్లుగా తాము పోరాడుతున్నామని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసిందిది.