//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీకి షాక్ ఇవ్వబోతున్న కీలకనేతలు ....జగన్ ఆశలకు గండి...!

Category : politics

వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర తర్వాత జిల్లాలో ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు బయటకుపోతున్నారు. ఇప్పటికే అరడజనుమందికిపైగా కీలక నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. తాజాగా వైసీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి చలమలశెట్టి సునీల్‌ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

సునీల్‌ బాటలో మరికొందరూ టీడీపీ వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ముందు నుంచీ వైసీపీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న నాయకుడు ఆ పార్టీలో ఇమడలేక సతమతమవుతున్నారు. మూడు నెలల కిందట సామాజిక వర్గీయులతో సమావేశమై భవిష్యత్‌ నిర్ణయంపై సమాలోచనలు చేసిన సమయంలోనే వైసీపీకి గుడ్‌బై చెప్తారని భావించారు.

ఆ సమయంలో జగన్‌ వారించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇపుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో తనకు ప్రాధాన్యం తగ్గించి చులకన చేస్తున్నారని భావిస్తున్న సదరు నేత.. ఇక ఆ పార్టీలో ఇమడలేనని, ఆ పార్టీకి భవిష్యత్‌ ఉండదని భావిస్తున్నారు.

కోనసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి కుతూహలంగా ఉన్నారని, అయితే సదరు నేతతో చర్చలు జరిపేందుకు సరైన మధ్యవర్తి కన్పించకపోడంతో కొంత జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. బయటకు మాత్రం తాను వైసీపీని వీడేదిలేదని గంభీరంగా చెప్తున్నారు. రాజోలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. బలమైన నేతగా గుర్తింపు ఉన్న సదరు నేత చేరికపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వైసీపీ టికెట్‌ ఇవ్వకపోవచ్చని ఇప్పటికే ఆ పార్టీ నుంచి సదరు నేతకు సిగ్నల్స్‌ రావడంతో టీడీపీలో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు నియోజకవర్గాలలో వైసీపీలో ఇమడలేని నేతలు టీడీపీ వైపు దృష్టిసారించారు. కాకినాడకు చెందిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి నిర్వహించిన సంగిశెట్టి అశోక్‌ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణ, రాజమహేంద్రవరం నుంచి కందుల దుర్గేష్‌ తదితరులు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఇపుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు పలువురు నేతలు తహతహలాడుతున్నారు.

Related News