Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం...!

Category : politics

వైసీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా కోసం లోక్ సభ లోన్ పోరాడి, లోక సభ చివరి రోజు తమ రాజీనామాల పత్రాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందించారు.

వీరు చేసిన రాజీనామాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. ఏప్రిల్-6న స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు తమ రాజీనామా లేఖలను సమర్పించారు.