//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా..?

Category : state politics

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం వాడి వేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం మోడీ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే...విపక్షం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. మోడీ వైఖరికి నిరసనగా...రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా చంద్రబాబు దీక్ష చెయ్యనున్నారు దీనితో ఒక్కసారిగా జగన్ లో కలవరం మొదలైనట్టు తెలుస్తుంది.

ఇప్పటికే కేంద్రంపై పోరుతో తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు దీక్ష చేస్తే మాత్రం మరింతగా ప్రజల్లో మద్దతు పెరిగే అవకాశం లేకపోలేదు. దీనితో జగన్ జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల రాజీనామాతో రాజకీయంగా కలిసొచ్చిందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మరింత మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలలో హోదా అంశాన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది.