//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైస్సార్సీపీ లోక్‌స‌భ బ‌రిలోకి దిగే అభ్యర్థుల జ‌బితా

Category : politics state

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల ఎంపిక‌లో వేగం పెంచింది. ఒక‌వైపు అసెంబ్లీ బ‌రిలోకి దిగే అభ్య‌ర్ధుల జాబితాను మ‌రోవైపు లోక్‌స‌భ బ‌రిలోకి దిగే అభ్య‌ర్దుల జాబితాను సిద్ధం చేసే ప‌నిలో వున్నారు వైసీపీ అధినేత జగ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాగానే వైసీపీ త‌న అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించాలని భావిస్తోంది.ఈ క్ర‌మంలో వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధుల జాబితా ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం అవుతోంది.

కానీ ఈ అభ్యర్థుల విషయం లో ఒంగోలులో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి జ‌గ‌న్ టిక్కెట్ ఇస్తారో లేక‌, వేరొక‌రిని బ‌రిలోకి దించుతార‌నేది తెలియాల్సి ఉంది.అలాగే తిరుప‌తి నుండి మ‌రోసారి మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌కు టిక్కెట్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

మొత్తం 20 స్థానాల్లో స్ప‌ష్ట‌త క‌నిపిస్తుండ‌గా, మిగ‌తా 5 స్థానాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో మ‌రో వారం రోజుల్లో మిగిలిన స్థానాల్లోని అభ్య‌ర్ధుల‌ను ఫైన‌లైజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

వైసీపీ తరపున ప్రచారంలో ఉన్న లోక్‌స‌భ బ‌రిలోకి దిగే అభ్యర్థుల జ‌బితా..

* కడప – అవినాష్ రెడ్డి

* రాజంపేట – మిథున్ రెడ్డి

* హిందూపూర్ – గోరంట్ల మాధవ్

* అనంతపురం – పిడి రంగయ్య

* నంద్యాల – శిల్పా రవిచంద్ర

* క‌ర్నూలు – క‌న్ఫ‌ర్మ్ కాలేదు

* చిత్తూరు – క‌న్ఫ‌ర్మ్ కాలేదు

* తిర‌ప‌తి – వరప్రసాద్ (ఇంకా స్ప‌ష్ట‌త‌రాలేదు)

* నెల్లూరు – మేకపాటి రాజమోహన్ రెడ్డి

* ఒంగోలు – వై వీ సుబ్బారెడ్డి (ఇంకా స్ప‌ష్ట‌త‌రాలేదు)

* బాప‌ట్ల – ప‌న‌బాక ల‌క్ష్మీ (ఇంకా స్ప‌ష్ట‌త‌రాలేదు)

* నరసరావు పేట- శ్రీ కృష్ణ దేవరాయలు

* గుంటూరు -మోదుగుల వేణుగోపాలరెడ్డి,

* మచిలిపట్నం – బాల‌శౌరి

* విజయవాడ – దాసరి జై రమేష్

* ఏలూరు – కోటగిరి శ్రీధర్,

* నరసాపురం – రఘురామ కృష్ణంరాజు

* అమలాపురం- చింతా అనురాధ

* రాజమండ్రి – మార్గాని భరత్

* కాకినాడ – బలిజి అశోక్

* అరకు – గొట్టేటి మాధవి

* అనకాపల్లి – వరద కల్యాణి

* విశాఖ – ఎంవివి చౌదరి

* విజయనగరం – బొత్స ఝాన్సీ

* శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్