Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం చంద్ర‌బాబుకు సింహ‌పురి సింహం ఫోన్‌..!

Category : politics

ఇళ్ల‌ల్లో పిల్లల‌ ప్ర‌వ‌ర్త‌న త‌ల్లిదండ్రుల పెంప‌కం ఆధార‌ప‌డి ఉంటుంది. అలాగే స్కూళ్ల‌ల్లో విద్యార్థుల ప్ర‌వ‌ర్త‌న ఉపాధ్యాయుల బోధ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక కంపెనీల్లో ఉద్యోగుల ప‌నితీరు బాస్‌ల నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అలాగే రాజ‌కీయ పార్టీల నేత‌ల తీరు.. ఆ పార్టీకి సంబంధించిన అధినేత‌ల తీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. అలాంటి పార్టీ అధినేత‌నే ఫ్యాక్ష‌నిస్టు భావ జాలాన్ని ప్ర‌ద‌ర్శిస్తే ఇక ఆ నేత‌ల ప‌రిస్థితి ఏంటి..? వారు కూడా అదే దారిలో న‌డ‌వాల్సిందేనా..? అధినేత మాట్లాడిన‌ట్టు అనాలోచితంగా మాట్లాడాల్సిందేనా..? అస‌లు విష‌యం తెలుసుకోకుండా ప్ర‌త్య‌ర్థుల‌పై బూతుల వ‌ర్షం కురిపించాల్సిందేనా..? అలాంటి నేత‌లు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో జీవ‌నం సాగిస్తున్న మ‌న‌కు అవ‌స‌ర‌మా..? ఇంత‌కీ ఎవ‌రా నేత‌లు..? అస‌లు క‌థేంటి అన్న సంగ‌తి తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. YSRCP leader Anil kumar yadav call to Chandrababu Naidu

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఇటీవ‌ల విశాఖ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి చేసిన హ‌త్యాయ‌త్నం దాడి సంగ‌తి ప్ర‌తీ ఒక్క‌రికీ విధిత‌మే. ఆ త‌రువాత వైసీపీ, టీడీపీ నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో రెచ్చిపోయారు. కిందిస్థాయి కార్య‌క‌ర్త‌లైతే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం కుట్ర ప‌న్ని మ‌రీ జ‌గ‌న్‌పై సింప‌తి సాధించేందుకు ఈ ప్లాన్ వేసింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతుండ‌గా, కాదు.. కాదు జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం కుట్ర మీ ప‌నేనంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు టీడీపీపై విష ప్ర‌చార పోస్టులు పెడుతున్నారు.YSRCP leader Anil kumar yadav call to Chandrababu Naidu

వైసీపీ కార్య‌క‌ర్త‌ల తీరు అలా ఉండ‌గా నాయ‌కులు, నేత‌ల‌ తీరు మ‌రోలా ఉంది. కొన్ని కోట్ల మంది వీక్షించే మీడియా చానెళ్ల మైకుల ముందు బూతుల వ‌ర్షం కురిపించారు. త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌పై కుట్ర చేసిన వారిని వ‌దిలిపెట్ట‌మ‌ని, అధికార పార్టీ నేత‌ల‌ను, నాయ‌కులను, కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్ల‌మీద తిర‌గ‌నీయ‌మంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఈ వీడియో క్లిప్పింగ్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. YSRCP leader Anil kumar yadav call to Chandrababu Naidu

అలా టీడీపీ నేత‌న‌లు, నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను బెదిరింపుల‌కు గురి చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో నెల్లూరు ప‌ట్ట‌ణ న‌గ‌ర ఎమ్మెల్యే మొద‌టి వ‌రుస‌లో ఉన్నారు. వైఎస్ జ‌గ‌న్‌కు ఏమ‌న్న జ‌రిగితే మాత్రం ఒక్క‌టే చెబుతున్నాం.. తెలుగు దేశం పార్టీ నాయ‌కులకు రోడ్ల‌లో తిర‌గే ప‌రిస్థితి ఉండ‌దంటూ హెచ్చ‌రించారు. అనీల్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. YSRCP leader Anil kumar yadav call to Chandrababu Naidu

ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ కురిపించిన బూతుల వ‌ర్షానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ల‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఒక ప్ర‌జాప్ర‌తినిధిగా, ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్య‌క్తి మాట్లాడాల్సిన మాట‌లేనా ఇవి..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. నీవు ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఎమ్మెల్యేవా..? లేక బెదిరింపుల‌కు పాల్ప‌డి ఎమ్మెల్యే హోదాను ద‌క్కించుకున్నావా..? అంటూ నెటిజ‌న్లు కామెంట్లను పోస్టు చేస్తున్నారు. ఇలా నెటిజ‌న్ల నుంచి త‌న‌పై వ్య‌తిరేక స్పంద‌న రావ‌డాన్ని గ‌మ‌నించిన ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ త‌న పొర‌పాటును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశాడు.YSRCP leader Anil kumar yadav call to Chandrababu Naidu

అనుకున్న‌దే త‌డ‌వుగా తెలుగుదేశంపై, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ కోరారు. ఆ నేప‌థ్యంలోనే సీఎం చంద్ర‌బాబు పీఏకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్‌.. కాసేపు సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత జ‌గ‌న్‌పై జ‌రిగిన కోడిక‌త్తి దాడి నేప‌థ్యంలో ఆ వ్యాఖ్య‌లు చేశానే త‌ప్ప‌.. మ‌రే ఉద్దేశం లేద‌ని సీఎం చంద్ర‌బాబుకు అనీల్ కుమార్ చెప్పారు. అందుకు అనీల్ కుమార్ యాద‌వ్ క్ష‌మాప‌ణ కోరారు. అనీల్ కుమార్ యాద‌వ్ చెప్పిన క్ష‌మాప‌ణ‌కు స్పందించిన చంద్ర‌బాబు ఒక ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉన్న‌ప్పుడు మ‌న‌కంటూ బాధ్య‌త‌లు ఉంటాయి. ఎంతో న‌మ్మ‌కంతో మిమ్మ‌ల్ని ప్ర‌జ‌లు ఎమ్మెల్యేగా గెలిపించారు. అటువంటిది మీరు చంపేస్తాం, రోడ్ల‌పై తిర‌గ‌నీయం అంటూ భాష మాట్లాడ‌టం స‌రికాదని సూచించారు .మీరు క్ష‌మాప‌ణ చెప్పాల్సింది నాకు కాదు.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అని సీఎం చంద్ర‌బాబు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్‌కు సూచించార‌ట‌. సీఎం చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు మంగ‌ళ‌వారం నాడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన అనీల్ కుమార్ యాద‌వ్ తాను టీడీపీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ కోరుతున్న‌ట్టు చెప్పారు.YSRCP leader Anil kumar yadav call to Chandrababu Naidu