//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ నెల 16న వైసీపీ తొలి జాబితా విడుదల

Category : politics state

వైసీపీ అధినేత జగన్‌ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 16 నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. అదే రోజు అభ్యర్ధుల జాబితా ప్రకటించిన అనంతరం… పిడుగురాళ్లలో తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ విజయలక్ష్మీ, షర్మిల కూడా పాల్గొంటున్నారు.

ఏపీలో ఎన్నికల హీట్‌ తారాస్థాయికి చేరింది. షెడ్యూల్ రిలీజ్‌ కావడంతో.. అభ్యర్ధుల జాబితాపై దృష్టిపెట్టిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ప్రచారానికి రెడీ అవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్‌….. ఈ విషయంలో ముందున్నారు. మార్చి 16 నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.16వ తేదీ ఇడుపుల పాయలో ఉదయం పది గంటలకు 26 నిమిషాలకు.. తొలి జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్ధుల జాబితా ప్రకటించిన అనంతరం…. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు జగన్‌…..

ప్రతి రోజు మూడు నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రచారం మొదలుపెట్టి, అదే రోజు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి చేరుకుని రాత్రికి అక్కడ బసచేస్తారు. ఆ మరుసటి రోజు మార్చి 17న నర్సీపట్నం, నెల్లిమర, గన్నవరం ప్రాంతాల్లో రాజకీయ ప్రచార సభలకు హాజరవుతారు.

ఇక ఈనెల 25 వ తేదీ నుంచి రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జగన్‌ ప్రచారం చేయనున్నారు. హెలికాఫ్టర్‌ ద్వారా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి.. అక్కడనుంచి బస్సుల్లో ప్రచారం చేయనున్నారు జగన్‌. వైసీపీ ప్రచారంలో వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పాల్గొంటున్నారు.