//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ, జ‌న‌సేన ఘోర ఓట‌మి..!

Category : politics

తెలంగాణ ఎన్నిక‌ల సంగ్రామంలో YSRCP,Janasena వ్యూహ‌మేంటి..? వైఖ‌రేంటి..? తెలంగాణ ఎన్నిక‌ల న‌గారా మోగిన‌ప్ప‌ట్నుంచి ఈ రెండు పార్టీల కేంద్రంగా ఈ చ‌ర్చ సాగుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఈ డిస్క‌ష‌న్ ఆత్మ‌ల దిశ‌గా సాగుతోంద‌ట‌. వైసీపీ, జ‌న‌సేన‌ల‌కు, ఆత్మ‌ల‌కు ఏం సంబంధం..? పైగా ఇదంతా తెలంగాణ ఎన్నిక‌ల‌తో ముడిప‌డి ఉండ‌టంతో ఈ ఎపిసోడ్ మ‌రింత ఉత్కంఠ రేపుతుంద‌ట‌. ఏపీలో TDP తో ఢీ అంటే ఢీ అంటోంది YSRCP. పాద‌యాత్ర‌తో పార్టీని ప‌వ‌ర్‌లోకి తీసుకెళ్లి తీరుతానంటున్నారు జ‌గ‌న్‌. అటు జ‌న‌సేన కూడా వేడి పెంచుతోంది. మ‌రి ఇవే పార్టీలు తెలంగాణలో ఏం చేయ‌బోతున్నాయి. ఈ ప్ర‌శ్న వినిపించిన వెంట‌నే ఆత్మ‌ల చ‌ర్చ మొద‌లైపోతుంద‌ట. అస‌లు వైసీపీకి జ‌న‌సేన‌కు ఆత్మ‌ల‌తో ప‌నేంటి..?

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో ఇప్ప‌టిదాకా YSRCP, Janasena త‌మ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఒక ఎంపీతోపాటు మూడు ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుచుకున్న YCP ఈ సారి మాత్రం త‌న యాక్టివిటీని స్టార్ట్ చేయ‌లేదు. అయితే, లాస్ట్ మినిల్‌లో ఆత్మ‌ప్ర‌బోధానుసారం ఓటేయ‌మ‌ని ఈ రెండు పార్టీలు పిలుపునివ్వ‌నున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంద‌ట‌.

ఆంధ్రాల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ‌లో పోటీ చేసి త‌మ బ‌లాల‌ను, బ‌ల‌హీన‌త‌ల‌ను బ‌య‌ట‌పెట్టుకోవ‌డం క‌న్నా.. వాటిని క‌నిపించ‌కుండా దాచేస్తే మంచిది అన్న ఆలోచ‌న‌లో జ‌న‌సేన ఉంద‌ట‌. సేమ్ టు సేమ్ ఇదే వ్యూహాన్ని అమ‌లు చేస్తే బెట‌ర‌న్న భావ‌న‌లో వైసీపీ కూడా ఉంద‌ట‌. దీంతో ఇరు పార్టీలు కూడా ఎన్నిక‌ల స‌మ‌రం చివ‌ర‌కు చేరిన వేళ ఆత్మ ప్ర‌బోధానుసారం అన్న వ్యూహానికి ప‌దునుపెడ‌తాయ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు సాగుతున్నాయ‌ట‌.

2014 ఎన్నిక‌ల్లో స‌మైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్నా తెలంగాణ‌లో ఒక ఎంపీని, ముగ్గురు ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నామ‌ని చెబుతున్న YCP ఈ సారి మాత్రం పోటీకి ఏ మాత్రం పోటీకి ఆస‌క్తి క‌న‌బర‌చ‌డం లేద‌ట‌. నిజానికి, తెలంగాణ‌లో వైసీపీకి బ‌ల‌మైన నేత‌లు కూడా లేరు. తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగితే ఫ‌లితాల సంగ‌తి ఎలా ఉన్నా ఏపీలో వాటి ప్ర‌భావం క‌చ్చితంగా ఉంటుంద‌ని అందుకే, ఆ త‌ర‌హా ప్ర‌యోగాల‌కు దూరంగా ఉండాల‌న్న వైసీపీ నాయ‌క‌త్వం ఉంద‌ట‌. అటు జ‌న‌సేన చుట్టూ కూడా మొద‌ట అనేక ప్రచారాలు సాగాయి. ఒకానొక ద‌శ‌లో బీఎల్ఎఫ్‌తో జ‌న‌సేన జ‌త క‌లుపుతుంద‌ని సీపీఎం చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌న‌సేన ఖండించ‌క‌పోవ‌డంతో ఆ పార్టీ పోటీమీద చ‌ర్చ మొద‌లైంది.

ఇలా వైసీపీ, జ‌న‌సేన కేంద్రంగా అనేక కోణాల్లో డిస్క‌ష‌న్స్ సాగుతున్న వేళ ఇరు పార్టీలు కూడా ఆత్మ‌ప్ర‌బోధానుసారం వేటు వేయ‌మ‌ని కోర‌డానికే ప‌రిమితం కాబోతున్న‌ట్టు రాజకీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇలా ఈ రెండు పార్టీలు పోటీ చేయ‌కుండానే త‌మ ఓటమిని అంగీరిస్తున్నాయ‌ని రాజకీయ ప్ర‌త్య‌ర్ధులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Related News