//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

8వ వసంతంలోకి వైఎస్‌ఆర్‌సీపీ

Category : politics

కడప జిలాలోని ఇడుపులపాయలో 2011మార్చి 12వ తేదీన దివంగత నేత వైఎస్‌ఆర్‌ సాక్షిగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 7 సంవత్సరాలు పూర్తీ చేసుకొని నేడు 8 వసంతంలోకి అడుగుపెట్టింది.తక్కువ సమయం లోనే పార్టీ కి మంచి పేరు, ప్రఖ్యాతలతో ముందుకు సాగుతుంది.

జగన్ 2010 లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. తరువాత 2011లోజరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ తల్లి వైఎస్‌ విజయమ్మ, కడప ఎంపీగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పోటీ చేసి రికార్డు విజయాన్ని నమోదుచేశారు. అడుగుపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వెడుకల్లో పాల్గొన్న జగన్

దాని తరువాత జగన్ ను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్, టీడీపీ పార్టీ లు కలిసి అయన మీద అన్యాయంగా కెసులు పెట్టి జైలుకు పంపారు. అయిన కూడా జగన్ వెనుకడుగు వేయకుండా పార్టీని ఎలా ముందుకు తీసుకు పోవాలని ఆలోచించాడు. ఎట్టకేలకు కొన్నిరోజుల తరువాత జైలు నుండి రిలీజ్ అయి వచ్చి మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నాడు.

2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలల్లో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత అయన నిరంతరం ప్రజల క్షేమం కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అయన భయపడకుండా ముందుకు సాగుతున్నాడు.

ఈ మధ్యే జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే అయన రాయలసీమ లోని నాలుగు జిల్లాను, అలాగే నెల్లూరు, ఒంగోలు జిల్లాలో తా యాత్రను పూర్తీ చేసుకొని ఏ రోజు గుంటూరు జలాల్లోకి అడుగు పెట్టారు. అక్కడే అయన పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్‌ జగన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాల్లోని ఇచ్ఛాపురం వరకు కోనసాగనుంది.