//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యే గా రానున్న...యాంకర్ అనసూయ

Category : movies

బుల్లితెర పై తనదైన ముద్ర వేసి, అటు నుంచి వెండి తెరపై మరో స్థాయి మార్క్ తో దూసుకుపోతున్న నటి, యాంకర్ అనసూయ గడిచిన గత కొంత కాలంగా తనదైన నటనతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ.... వెళుతున్న ఈ భామ రీసెంట్ గా నటించిన ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ను అలరిస్తూనే ఉంది.ఇలా తను ఎంచుకున్న సినిమాల విషయానికి వస్తే "క్షణం, రంగస్థలం" వంటి సినిమాల్లో తనదైన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. అలాగే గ్లామర్ పాత్రల్లో నటించడానికి యే మాత్రం వెనకడుగు వేయకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది.ఇలా విన్నర్ సినిమాలో 'సూయ..

సూయ' అనే సాంగ్ లో సాయి ధరమ్ తో కలిసి జత కట్టింది. అలాగే రీసెంట్ సూపర్ హిట్ 'ఎఫ్ 2' సినిమాలో కూడా మరో ఐటెం సాంగ్ లో నటించింది ఈ బ్యూటీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వచ్చిన ఏ సినిమా అవకాశాన్నీ అసలు వదలడం లేదు అనసూయ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

ఇలాంటి సమయంలో నే అనసూయ కు మరో గోల్డెన్ అవకాశం ఇంటి డోర్ కొట్టి మరీ పిలిచింది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర వహించిన ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ చిత్రం ' యాత్ర 'రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీసర్, ట్రైలర్,సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ కాగా.. ఈ సినిమా పై కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.అయితే వైయస్ఆర్ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటించ నున్న విషయం తెలిసిందే.అయితే ఆమె ఇందులో కర్నూలు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాత్రని పోషిస్తోంది. 'యాత్ర' సినిమాలో ఎక్కువగా వైఎస్సార్ పాదయాత్ర గురించి ఎక్కువగా చూపించబోతున్నారని.2004 లో పాదయాత్ర నేపధ్యంలోగౌరు చరితారెడ్డి గారు నందికొత్కూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్ల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎలా ఎదుర్కొన్నారు....?

అలాగే 2014లో పన్యం నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రమాభూపాల్ రెడ్డిని వైఎస్సార్ పార్టీ తరఫున ఎలా ఓడించిందనే విషయాలను కథలో క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం అనసూయ పాత్రను చాలా స్పెషల్ గా తెరపై చిత్రీకరించనున్నారట.2004 ఎన్నికల్లో వై.యస్.ఆర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే ఇతి వృత్తం లో ఈ సినిమా కథనం సాగుతున్నట్టు. అయితే 2004 నుండి 2014 వరకు వైఎస్సార్ పార్టీ తరఫున చరితారెడ్డి యెక్క పాత్ర,ఆమె పార్టీ కోసం కష్ట పడిన తీరు సృష్టించిన రికార్డులను ఆమె పాత్ర ద్వారా తెలియ జేయబోతున్నరని ఈ పాత్రలో అనసూయ తన నటన తో మెప్పించారని చిత్ర బృందం కూడా ధీమా గా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె పాత్ర డీగ్లామరస్ రోల్ లో ఉండనుంది.

అయితే ఈ యాత్ర సినిమా లో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, మహి వి రాఘవ దర్శకత్వము వహిస్తున్నారు. ఇప్పటికే దేశమంతా బయోపిక్ సినిమాలు తమ బలాన్ని చూపిస్తున్న సందర్భంగా ఈ సినిమా కూడా

ఫిబ్రవరి8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక పవర్ ఫుల్ లేడీఎమ్మెల్యే పాత్రలో అనసూయ ఎంత మేరకు న్యాయం చేసిందో చూడాలి. అంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే .

Related News