//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివేకా మర్డర్ కు ముందు ఆ ముగ్గురు..

Category : state politics

వివేకానంద మర్డర్‌ కేసు విచారణ మొదలై రోజులు దాటుతున్నాయి.. కానీ అసలు దోషులు ఎవరన్నది మాత్రం తేలడం లేదు. అయితే కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు మాత్రం త్వరలోనే కేసును చేధిస్తామంటున్నారు. దీనిలో భాగంగా కొందరు వ్యక్తుల్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. హత్యకు బీహారీ గ్యాంగ్ ద్వారా పథక రచన జరిగినట్టు అనుమానం రావడంతో.. ఆ దిశగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మర్డర్‌కి ముందు పులివెందులకు ముగ్గురు కొత్త వ్యక్తులు వచ్చినట్టు వార్తలు రావడంతో..

ఆ ముగ్గురు వ్యక్తులను పట్టకోవడంపై సిట్‌ ఫోకస్‌ చేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసినట్టు తేలడంతో అక్కడ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. పట్టణంలోని లాడ్జిల్లో కొత్తవారు ఎవరైనా దిగారా అన్న దానిపైనా ఇప్పటికే ఆరా తీశారు. బస్టాండు సమీపంలో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను సిట్ పరిశీలిస్తోంది. హత్య తర్వాత వివేకా ఇంట్లో ఉన్న కోటి 20 లక్షలు కూడా చోరీకి గురైనట్టు అనుమానాలు రావడం, బీరువాపై కూడా రక్తపు మరకలు ఉండడంతో.. ఆ కోణంలోనూ విచారణ సాగుతోంది. వివేకా సన్నిహితులు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, శేఖర్‌రెడ్డి, శివశంకరరెడ్డితోపాటు వాచ్‌మెన్‌ను, వంటమనిషిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. వీరితోపాటు మరికొందరు కీలకమైన వ్యక్తుల్ని కూడా విచారించారు. వీరంతా ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య జరగడానికి 10 రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలన్నీ విశ్లేషిస్తున్నారు. అందరి కాల్‌డేటా కూడా తీసుకుని..

కామన్ పాయింట్ ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. వివేకా ఇంటిని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్‌ అయన్నార్‌ పరిశీలించారు. సస్పెండైన సీఐ శంకరయ్యను పిలిపించి ఘటన జరిగిన రోజు పరిణామాలపై ఆరా తీశారు. బెడ్‌రూమ్‌, ఇంటి పరిసరాలు అన్నీ తిరిగి చూశారు. ఆధారాలు మాయం చేశారన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. స్పాట్‌లో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ కేసును మరో రెండు మూడు రోజుల్లో అధికారులు కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్య కేసు విచారణపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని వివేకానంద కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న సీఐ.. హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పంచనామా జరగకముందే మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి ఎలా కట్లు కట్టిస్తారని ప్రశ్నించారు.

Related News