Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాసేపట్లో వైఎస్‌ వివేకానందరెడ్డి అంతిమయాత్ర

Category : politics state

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది. ప్రస్తుతం వివేకా భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కాగా... పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. వివేకాను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు పెద్దఎత్తున పులివెందులకు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా వివేకా హత్య నేపధ్యంలో పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పారా మిలటరీ బలగాలు మోహరించాయి.