//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజారెడ్డి ఘాట్ లో వివేకానంద రెడ్డి అంత్య క్రియలు పూర్తి

Category : politics state

దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమ యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. తమ ప్రియతమ నేతలకు కడపటి వీడ్కోలు పలికేందుకు పెద్ద యెత్తున అభిమానులు పులివెందులకు తరలి వచ్చారు.

వైఎస్ వివేకా అంతిమ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, అవినాష్ రెడ్డి సహా పలువురు వైసిపి నాయకులు, బంధువులు పాల్గొన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు రాజారెడ్డి ఘాట్ లో జరిగాయి . శనివారం ఉదయం ప్రార్థనలు ముగిసిన తర్వాత వైఎస్ వివేకా అంతిమ యాత్ర ప్రారంభమై కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య రాజారెడ్డి ఘాట్ కు చేరుకున్న వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పులింవెందుల లోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో శనివారం ఉదయం 11 గంటల ప్రాంత్రంలో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Related News