//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న నిర్ణయం..!

Category : politics

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గ‌త కొన్ని రోజులుగా శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి కోడిక‌త్తితో చేసిన గాయంతో వైద్యుల సూచ‌న‌ల మేర‌కు విశ్రాంతి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడ‌ని, ఇదంతా ఏపీ అధికార పార్టీ నేత‌ల కుట్రేనంటూ వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌గా.. ఎన్నిక‌ల స‌మ‌యం త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి క‌లిగేందుకు త‌న‌కు తానుగా వేసుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి చేత కోడిక‌త్తితో చిన్న గాయం చేసుకున్నాడ‌ని టీడీపీ నేత‌లో ఆరోపిస్తున్నారు.

వైసీపీ, టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు ఇలా ఉంటే సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు మ‌రోలా ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తున్నారు. ఎవ‌రికైనా ఓ చిన్న గాయం అయితే వెంట‌నే ఆస్ప‌త్రిలో చూపించుకుంటార‌ని, అటువంటిది కోడిక‌త్తితో గాయం అయిన‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ విశాఖ‌లోని ఆస్ప‌త్రుల్లో చికిత్స పొంద‌కుండా.. ఎటువంటి వైద్య స‌హాయం లేకుండా హైద‌రాబాద్ వ‌ర‌కు ఎలా రాగ‌లిగాడ‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాకుండా, త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నానికి సంబంధించి కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల‌కు జ‌గ‌న్ ఎందుకు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు..? కోడి క‌త్తి ఏమైంది..? జ‌గ‌న్ ఆ స‌మ‌యంలో వేసుకున్న చొక్కా ఏమైంది...? అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఆ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు మీడియా స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు. అయితే, ఈ మీడియా స‌మావేశంలో జ‌గ‌న్‌పై జ‌రిగిన కోడిక‌త్తి ఘ‌ట‌న‌నే ప్రధాన అంశంగా చేసుకుని మాట్లాడ‌తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే, గ‌త మూడు రోజులుగా సీ.రామ‌చంద్ర‌య్య వైసీపీలో చేరిక‌పై చ‌ర్చ‌లు జ‌రుగాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి సీ.రామ‌చంద్ర‌య్య మీడియాతో మాట్లాడుతూ తాను ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్నాన‌ని, అక్క‌డ్నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకుని జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండగా , వైఎస్ జ‌గ‌న్ రేపు సాయంత్ర 7 గంట‌ల 55 నిమిషాల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ‌కు చేరుకోనున్నారు.

Related News