Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కోసం రంగంలోకి దిగిన విజయమ్మ ... ఎంతైనా అమ్మ కదా

Category : state politics

వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి అధినేతగా, ప్రతిపక్ష నేతగా, రాజన్న బిడ్డగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నేత. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ బాసటగా నిలుస్తున్నారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పనిచేసిన సీనియర్ నాయకులను జగన్మోహన్ రెడ్డికి బాసటగా ఉండాలని ఆమె కోరుతున్నారు.

వైయస్సార్ తరహాలో పాదయాత్రలు చేస్తూ ప్రజల సమస్యలపై అధ్యయనం చేస్తూ తండ్రి బాటలో నడుస్తున్న తన తనయుడిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆమె తెగ తాపత్రయపడుతున్నారుఇక విజయమ్మ సాఫ్ట్ గా గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసి కలిసి పనిచేద్దాం రండి అంటూ ఆహ్వానించేస్తున్నారట విజయమ్మ.

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికి ఎక్కడ పేరును ఖరారు చేస్తున్నారు ప్రధాన పార్టీల అధినేతలు. గత ఎన్నికలకు ముందు వైసిపి అధికారంలోకి ఉందనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుండి నేతలు పెద్ద సంఖ్యలో పోలో మని వైసీపీలోకి క్యూ కట్టారు. ఇక టిడిపి గెలవడంతో తిరిగి టిడిపి లో వచ్చి చేరారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓటమిపాలైన హేమాహేమీలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న నేపథ్యంలో వారిని ఎలాగైనా వైసీపీలోకి తీసుకురావాలని జగన్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలిగి గత ఎన్నికల ప్రభావంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న కొణతాల రామకృష్ణ, సబ్బంహరిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు జగన్.

ఇక వీరిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్న జగన్ అందులో భాగంగా తల్లి విజయమ్మను ఆ నేతలను అడగాలని కోరారు.ఇక విజయమ్మ సైతం రంగంలోకి దిగి తమ కుమారుడికి సహకరించాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి వారికి ఎంతో చేశారని, వైఎస్ తో ఉన్న అనుబంధం నేపథ్యంలోనైనా అందరి కలిసి పనిచేద్దాం రండి అని ఆహ్వానించారు. మీ లాంటి సీనియర్ నాయకులు పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని, బాబుకి చాలా సహకరించినట్లుగా ఉంటుందని ఆమె తనదైన శైలిలో కోరారు. ఇక ఆమె ప్రతిపాదనలు విన్నటువంటి ఇరువురు నేతలు ఆలోచిస్తామని చెప్పారని టాక్ . రాజకీయాల్లో రాణించడానికి ఎవరి అండదండలు లేకుండా కొడుకు పడుతున్న కష్టాన్ని చూసిన విజయమ్మ తన కుమారుడి కోసం తాను సైతం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జగన్ కు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని ఆమె తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతైనా అమ్మ ప్రేమ కదా .

Related News