//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వై.ఎస్. షర్మిల... లాంగ్ గ్యాప్.. వైర‌ల్ న్యూస్‌..!

Category : politics movies

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెల్సిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండ‌గా.. వైఎస్ స్నేహితుడు కేవీపీ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక మరికొన్ని పాత్రల కోసం చిత్ర యూనిట్ నటీ నటుల ఎంపికలో బిజీ అయ్యిందట.

అయితే తాజాగా వైఎస్ కూతురు షర్మిల పాత్ర కు గాను ఓ ప్రముఖ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన ఖుషి మూవీలో నటించిన భూమిక ను షర్మిల పాత్రకు గాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక వైఎస్ బయోపిక్‌లో షర్మిల, భారతి, జగన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉండవట. వైఎస్ పాదయాత్ర, అధికారంలోకి ఎలా వచ్చారు. రాష్ట్రాన్ని ఎలా పరిపాలన సాగించారనే విషయాలు మాత్రమే ఈ బయోపిక్‌లో చూపించబోతున్నారని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.