//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యాత్ర నుండి విజయమ్మ ఫస్ట్ లుక్ విడుదల !

Category : movies

దివంగ‌త నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర'. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్మూట్టి ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి విజయమ్మ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విజయమ్మ పాత్రలో ఆశ్రీత వేముగంటి నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5గంటలకు విడుదల చెయ్యనున్నారు.

మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు వైఎస్ రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. పోసాని మురళి కృష్ణ, సుహాసిని, అనసూయ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 70 ఎంఎం బ్యానర్‌లో ‘యాత్ర’ను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.