//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కియాలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఆత్మ

Category : politics

కియా కంపెనీ బాసు ,ఏపీ ముఖ్యమంత్రికి రాసిన లేఖ గత రెండు రోజులుగా ఆసెంబ్లీని కుదిపేస్తుంది....తాజాగా ఈ రోజు కూడా ఆ లేఖ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కియా మొదటి ప్లాంట్‌ను ఏపీలో పెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు కియా మోటార్స్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసిందని ఆయన వెల్లడించారు.' 2007లోనే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమను ఫ్యాక్టరీ పెట్టమని ఆహ్వానించారని ..' కియా కంపెనీ బాసు, ఎపీ ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌కి రాసిన లేఖను ఈ రోజు అసెంబ్లీలో మంత్రి

రాజేంద్రనాధ్‌ చదివి వినిపించగానే, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు లేచి,'' మీకు అభినందనలు బుగ్గన గారు, మీరు చెప్పేది ఎలా ఉందంటే, వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆత్మ వెళ్లి కియాతో ఒప్పందం కుదుర్చుకుందా...?'' అని ప్రశ్నించారు. తన చెట్టును తానే నరుక్కుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు.ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బాబు అన్నారు. 'కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారంట.. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగ పడలేదట' అంటూ ఎద్దేవా చేశారు బాబు. 'కియా'ను వైఎస్‌ తెచ్చరనడం వైసీపీ అబద్ధాలకు పరాకాష్ట అని బాబు అన్నారు.