//single page style gallary page

YS Jagan to AP Assembly from today

Category : politics

Click here to read this article in Telugu

నేటి నుంచి ఏపీ అసెంబ్లీకి వై.యస్ జగన్!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం ఐదు రోజులపాటు సాగే అవకాశముంది. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకటఅప్పలనాయుడు తొలుత శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మిగతా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురువారం జరగనుండగా, శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. జూన్ 15, 16 తేదీలు సెలవు కావడంతో మళ్లీ 17, 18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి.

ఈ రెండు రోజులు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. తిరిగి జులైలో బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, గతంలో లోకేష్‌ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. అలాగే గత సభలో వైసీపీ శాసనసభ పక్ష కార్యాలయం, టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయం, ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన ఛాంబర్‌లను ప్రస్తుతం వైసీపీ తీసుకుంది. కాగా, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభలోని తన ఛాంబర్లోకి ప్రవేశిస్తారు. వేదపండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఛాంబర్‌లో ఆయన ఆసీనులు కానున్నారు.

అనంతరం 11.05 గంటలకు శాసనసభలోకి వస్తారు. శాసనసభ సమావేశాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని, సభలో ప్రతిపక్షాన్ని తగిన విధంగా గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసభ ఆవరణలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 14 తర్వాత సమావేశాలు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం, అప్పటి స్పీకర్‌లా వ్యవహరించకుండా సభను హుందాగా నడిపిస్తామని, ప్రతిపక్ష పార్టీ సభ్యులను గౌరవిస్తామని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అవమానించేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.

The first legislative assemblies are scheduled to begin on Wednesday after the formation of a new government in Andhra Pradesh. The conventions starting at 11am on Wednesday are likely to last for five days. Legislative Affairs Advisory Committee (BAC) will take a decision on this. Protest Speaker Shambangi Chinna Venkatappalanaudu will first swear by the legislators. Chief Minister YS Jagan Mohan Reddy and then Chief Opposition Leader Chandrababu Naidu will be sworn in. Then the rest of the MLA will continue to swear. Speaker and deputy speaker will be held on Thursday, Governor ESL Narasimhan will address the two Houses on Friday. Meetings will be held on 17th and 18th on the 15th and 16th of January.

The debate on the resolution of the Governor's speech thanked these two days. After that the House will be postponed. Budget sessions will be held in July. In the last assembly, the Deputy Speaker was nominated by Leader of Opposition Chandrababu and former office of the Lokesh office to TDP Legislative office. In the last session, the VCP legislative party office, TDP Legislative Assembly office and Leader of the Opposition in the Opposition took Jagan's chamber to the present. Meanwhile, Chief Minister Jagan Mohan Reddy will enter his Chamber of Legislative Assembly at 10.30 am on Wednesday. The puja program will be held in the chamber under the guidance of the Vedas.

Then comes to Legislative Assembly at 11.05 pm. Government Chief Whip Srikanthreddi said that the Assembly meetings will be held democratically and respect the Opposition in the House. Speaking to the media on Tuesday, Srikantapedi told media: Should the meetings continue after June 14? Whether or not? To discuss the issue at the BAC meeting and make a decision. During the sessions, the previous government said that the House would not be treated as a speaker, and that the House would respect the members of the opposition party. He blamed the past government for insulting the opposition during the assembly conclave.