//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ వార్తల్ని చూసి షాకయ్యా: జగన్

Category : politics

తనను ఏడేళ్లుగా కేసులతో వేధిస్తు, కోర్టుల చుట్టూ తిప్పి బాధిస్తు ఉన్న తాను మాత్రం ప్రజాక్షేత్రంలో ఏనాడూ వెన్ను చూపలేదని చూపనుకోడా , తన రాజకీయా జీవితం ప్రజా సమస్యలపై పోరు బాటులో వెనకడుగు వేయలేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్‌ భారతి పై

వస్తున్న వార్తలు కు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో తన సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని జగన్ చెప్పుకొచ్చారు. కొంతమంది తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా వదలకుండా వేధిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఓ లేఖలో జగన్ తన కుటుంబాన్ని, తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే అంశంపై ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన జగన్.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు లేఖ రాశారు. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నాకే చార్జిషీట్‌లో ఏముందన్న విషయం ఎవరికైనా తెలుస్తుందని, అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఈడీ నుంచి ఈ వార్త ఎలా తెలిసిందని జగన్ ప్రశ్నించారు. సీబీఐ విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తులను ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Related News