//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM

Category : politics

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటితో మూడు వేల కిలో మీటర్లకు చేరుకుంది. పాదయాత్ర ఆరంభించి 269 వరోజు ఆయన విజయనగరం జిల్లాలో ఈ మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోబోతున్నారు.YS Jagan to Cross 3000Km Successfully

కడప జిల్లా లోని ఇడుపులపాయలో మొదలైన జగన్ ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాల్లో ముగిసి 12 వ జిల్లా అయిన విజయనగరంలో ప్రవేశించింది. జిల్లాలోని ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద జగన్ ఈ 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతున్నారు. ఇంతటి క్లిష్టమైన సుదీర్ఘ పాదయాత్రను వైసిపి అధినేత జగన్ సునాయాసంగా కొనసాగించడానికి కారణం ఆహారం, ఆరోగ్యం కోసం ఆయన తీసుకున్న జాగ్రత్తలేనని అనుచరులు అంటున్నారు.YS Jagan to Cross 3000Km Successfully

వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేపట్టి నేటికి 269 రోజులు. ప్రజాసంకల్పయాత్ర పేరిట నవంబర్ 6, 2017న ఇడుపులపాయ నుంచి ప్రారంభించి ఇచ్ఛాపురం వరకూ సుమారు 3000 కిలో మీటర్ల పాదయాత్ర జరపాలని జగన్ లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో జగన్ పాదయాత్ర 11 జిల్లాల్లో ముగిసి 269 వ రోజు సోమవారం 12 వ జిల్లా విజయనగరంలో ప్రవేశించింది. జగన్ పాదయాత్ర ఈరోజే విజయనగరం జిల్లాలో ప్రవేశించినందున ఈ జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఆయన పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే ఇలా రెండు జిల్లాలు ఉండగానే జగన్ 3000 కి.మీ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.YS Jagan to Cross 3000Km Successfully

పాదయాత్ర ప్రారంభించి 269 రోజులు అవుతున్నా జగన్ దినచర్యలో ఏ ఒక్కరోజూ ఏ మార్పు ఉండదని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. వివిధ కారణాల రీత్యా రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా...ఉదయం మాత్రం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారని...లేవడంతోనే గంట పాటు వ్యాయామం...కాలకృత్యాలు ...అనంతరం ఆరున్నర...ఏడు గంటల వరకు పత్రికల పఠనం...చేస్తారని చెప్పారు. ఆ తర్వాత పార్టీ విషయమై ముఖ్యులతో ఫోన్‌ సంభాషణ ఉంటుందని తెలిపారు. YS Jagan to Cross 3000Km Successfully.

Related News