//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ ప్రచార వ్యూహం రెడీ .. షర్మిల 6 జిల్లాల్లో , జగన్ 7 జిల్లాల్లో

Category : politics state

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అడుగులు ముందుకు వేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా మొన్నటి వరకు సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్ ప్రస్తుతం సమాయత్త పరచడానికి సమర శంఖారావం సభలను నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారా తాను చెప్పదలుచుకున్నది అటు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు సైతం చెప్తున్న జగన్ వచ్చే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యూహాలను సైతం సిద్ధం చేసుకున్నారు.

పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ప్రజల అభిమానం - ఆదరణతో అధికారంలోకి రావాలని అనుకుంటున్న జగన్ ఇప్పటికేదిగ్విజయంగా 13 జిల్లాలో పాదయాత్ర పూర్తి చేశారు. దీనిద్వారా పార్టీని - నవరత్నాలను ప్రజలకు పరిచయం చేశారు. ఇక ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారు జగన్. అందుకే.. 7 జిల్లాల్లో ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. మిగిలిన ఆరు జిల్లాల్లో జగన్ తరపున ఆయన సోదరి షర్మిళ ప్రచారం చేయబోతున్నారు.

షర్మిళ రాయలసీమ నాలుగు జిల్లాలైన కడప - కర్నూలు - అనంతపురం - చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం - నెల్లూరు జిల్లాలో ప్రచారం చేస్తుంది. ఈ జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక మిగిలిన 7 జిల్లాలపై జగన్ ఫోకస్ పెట్టబోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా మారిన ఉభయగోదావరి జిల్లాలను ప్రధానంగా టార్గెట్ చేశారు జగన్. ఇప్పుడు ఇదే జిల్లాల్లో వైసీపీ ఎక్కువసీట్లు గెలవాలన్నదే జగన్ వ్యూహం. అందుకే.. ఉత్తరాంధ్ర - గోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోపే.. 13 జిల్లాల్ని కవర్ చేయాలనేదే తన ప్లాన్ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అధికార టీడీపీని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

Related News