//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైస్ జగన్ మోహ‌న్ రెడ్డి.. జీవిత స‌త్యాలు.. ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క తెల్సుకోవాల్సిందే..!

Category : politics

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన రెడ్డి లేదా జగన్, పులివెందుల నియోజిక వర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా ఎన్నుకోబడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయ‌న‌ ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి- విజ‌య‌మ్మ గార్ల ఏకైక పుత్రుడు. 21 డిసెంబర్ 1972 జమ్మలమడుగు గ్రామం కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించారు. భార్య పేరు భారతి రెడ్డి కాగా... హర్ష, వర్ష అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.

ఇక‌పోతే జ‌గ‌న్ వ్యాపార రంగంలో ప్రవేశించి పలు పరిశ్రమలు స్థాపించారు. ఇందులో భారతి సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జల విద్యుత్ కేంద్రము ఉన్నాయి. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలను కలుసుకోవాలని తలపెట్టిన ఓదార్పు యాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ కి వై యస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు. కాంగ్రెస్‌తో విభేదాలు, ఆ త‌ర్వాత‌ అవినీతి పరుడిగా ఆరోపణలు ఎదురుకొని, 16 నెలల జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇప్పటికి ప్రతి శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకి హాజరవుతున్నారు. ఇక 2019లో ఎలాగైనా ముఖ్య‌మంత్రి కావాల‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాద‌యాత్ర చేస్తున్నారు.