//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కి చేరిన పీకే సర్వే....ఉండేదెవరు.....ఊడేదెవరు.....!

Category : politics

ఏపీ రాజకీయాలలో కీలకమైన ఈ సమయం లో పీకే సర్వే తో వైసీపీ నేతల గుండెల్లో గుబులుమొదలైంది. దీనికి గల ప్రధాన కారణం...నియోజకవర్గాల వారిగా వివిధ పార్టీల బలాలు, గెలుపు గుర్రాలు ఎవరు..ఎక్కడ ఏ నాయకుడికి, ఏ సామాజికవర్గానికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదితర వివరాలలో కూడిన సర్వేను వైసీపీ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ టీమ్ పూర్తి చేసిందని తెలుస్తుంది.

ఈ సమగ్ర నివేదిక ఇప్పటికే పాదయాత్ర లో ఉన్న వైసీపీ పార్టీ అధినేత జగన్ కు చేరిందని సమాచారం. ఈ సర్వే నిర్వహిస్తున్నామని వైసీపీ పార్టీ నేతలకు కూడా ఏ మాత్రం సమాచారం లేకుండానే సర్వేను పీకే టీమ్ పూర్తి చేసింది. వివిధ వర్గాల ప్రజలతో పీకే టీం వారు మమేకమై ప్రజాభిప్రాయాలని సేకరించారు.

ఈ సర్వే నివేదిక ఆధారంగానే పలువురు నేతలకు జగన్ ఇప్పటికే పరోక్ష సంకేతాలను పంపినట్టు తెలుస్తుంది. ఈ సర్వే పై పాదయాత్ర జరుగుతున్న జిల్లా కీలక నేతలతో సమావేశం నిర్వహించాలని ప్రయత్నం చేసిన అది కుదర్లేదు. ఈ తరుణం లో త్వరలో నేతలందరితో వరుస భేటీ లు నిర్వహిస్తాడని సమాచారం.

పీకే టీమ్ నియోజకవర్గాల వారిగా సర్వే జరిపిన విషయం వాస్తవమేనని, అయితే సర్వేలో ఏయే నాయకుడిపై ఎలాంటి రిపోర్ట్ ఉందో మాత్రం ఎవరికీ తెలియదని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ సర్వే గుబులు రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని పలువురు నేతలు టెన్షన్ కు గురౌతున్నారు.