Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రస్థానం .. అది జగన్ సంకల్పానికి చిహ్నం

Category : state politics

వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజక పాలన చేసిన రాజనీతిజ్ఞుడు. ఐదేళ్లకు పైగా రాజకీయాలను శాసించిన వైయస్సార్ ప్రస్థానం అకాల మరణంతో ఆగిపోయింది. అప్పటివరకు ప్రజల కోసం ఆయన వేసిన అడుగు ఆగిపోయింది. ఇక అడుగులను కొనసాగిస్తూ రాజన్న బిడ్డ గా నేనున్నా అంటూ ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. తెలంగాణ, ఏపీ లుగా విభజించబడిన నేపథ్యంలో ఏపీ ప్రజలను అక్కున చేర్చుకోవడానికి వారి సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజన్న బిడ్డ ప్రజల్లోకి వెళ్లారు.

గత ఎన్నికల్లో టిడిపి కి దీటుగా గట్టి పోటీ ఇచ్చి అధికారం దక్కకుండా ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మీ కోసం నేను సైతం అంటూ ముందుకు కదిలారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన ప్రస్థానం చరిత్రపుటల్లో నిలువదగినది.నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ, వారి కన్నీళ్లను తుడవడం ఏ లక్ష్యంగా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడాదికిపైగా పాదయాత్ర చేశారు జగన్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించిన ఆయన పాదం అలుపెరుగకుండా ఊరు ఊరు వాడ వాడ తిరుగుతూనే ఉంది. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైసిపి అధినేత రాజన్న ముద్దుబిడ్డ ప్రజా సంకల్పానికి ప్రజలు సైతం జేజేలు పలికారు.

ఎండనకా వాననకా చలిని సైతం లెక్క చేయక తాడిత పీడిత బడుగు బలహీనవర్గాల ప్రజాచైతన్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం, నేనున్నానంటూ ముందుకు సాగి వారి కష్టాలను విని, కన్నీళ్లను తుడిచి, ప్రభుత్వాన్ని నిలదీసి తనదైన శైలిలో యాత్రను కొనసాగించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత ఇష్టమైన ఇడుపులపాయ ఎస్టేట్ నుండి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9న ఇచ్చాపురంలో ముగిసింది. ఏపీ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై గళం విప్పిన జగన్ టిడిపి అసమర్థ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి అనుకున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం కోసం తండ్రి బాటనే ఎంచుకున్నారు. ప్రజాక్షేత్రంలో అందరి బిడ్డగా రాజన్న బిడ్డ నిలిచారు. తండ్రిని మించిన తనయుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నవరత్నాలు పథకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గించి రైతుల ఆత్మహత్యలను నివారించే దిశగా తాను పని చేస్తానని రైతాంగానికి భరోసా ఇచ్చారు. సుదీర్ఘ యాత్ర చేసిన వైయస్ జగన్ అందరివాడు అనిపించుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి మొత్తం 134 నియోజకవర్గాలలో ప్రజా సంకల్ప యాత్ర లో నిర్వహించారు. 124 బహిరంగ సభలలో ఆయన పాల్గొన్నారు. తన మనసులోని మాటను ప్రజాసంక్షేమం కోసం తాను చేయదలచుకున్నాను అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఈ గ్రామాన్ని పలకరించిన ఇసుకేస్తే రాలనంత జనం జగన్ కు బ్రహ్మరథం పట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నా జగన్ పాదయాత్ర కొనసాగింది. ఎండలు ఇబ్బంది పెడుతున్న, తుఫానులు అని బెదిరిస్తున్న ఆయన ప్రజా సంకల్పం ముందు అవి చిన్నబోయాయి.

తనతో మాట్లాడటానికి వచ్చిన ఎవరినైనా సరే అత్యంత ఆదరంగా అక్కున చేర్చుకునే జగన్మోహన్ రెడ్డి ఏపీ లోని చెల్లెల్లు అందరికి అన్నయ్యారు.తాతలకు మనవడు అయ్యాడు. ప్రతి ఇంట్లోనూ బిడ్డ అయ్యాడు. రాజన్న బిడ్డ గా అందరి ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తన ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు. బ్రతుకు కు భరోసా అందించాడు. తను సాగించిన సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్న వైయస్ జగన్ జనవరి 9న తన ప్రజా సంకల్ప యాత్ర ను ముగించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో అవకాశం వస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఏపి ప్రజల సమస్యలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. మడమ తిప్పని నాయకుని బిడ్డగా తాను సైతం వైయస్సార్ తరహా పాలనను అందిస్తానని ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చారు. ప్రజల కోసం 3648 ఎనిమిది కిలోమీటర్లు అవలీలగా నడిచిన నేత అధికారమిస్తే ఆ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం ఎంతవరకైనా పని పని చేస్తారేమో. ఏదేమైనా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో అవిశ్రాంతంగా వేల కిలోమీటర్లు నడిచిన జగనన్న ఓపికకు జేజేలు చెప్పాల్సిందే.

Related News