//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ కి జగన్ సవాల్ !

Category : politics

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందన్న విషయం తనకు ముఖ్యం కాదని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలనూ అమలు జరపాలన్నదే తన డిమాండని వైఎస్ జగన్ ప్రకటించారు.

కానీ ప్రత్యేక హోదా రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలిగే నిర్ణయమనేది ప్రజల విజయమని వైసీపీ రాజీనామాలు చేస్తామని గతంలోనే అల్టిమేటం ఇచ్చామని... అవిశ్వాసం పెడతామని చెప్పామని... ప్రజల్లో కూడా వ్యతిరేకత రావడంతోనే చంద్రబాబు బయటకి వచ్చారని అలాగే రాజీనామాలు చేయాలనుకున్నప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఏంటని జగన్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం పెట్టడానికి తాము నిర్ణయించామని, అవిశ్వాసానికి చంద్రబాబునాయుడు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబుకు ఆలోచించుకునే సమయం ఇవ్వడానికే 21 వరకూ గడువు ఇస్తున్నామని, రాష్ట్రం మొత్తం ఒకతాటిపై నిలబడి 25 మంది ఎంపీలూ అవిశ్వాసానికి మద్దతుగా నిలిస్తే, కేంద్రానికి ఓ సంకేతం వెళుతుందని, మరింత ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.

లేకుంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా తాము మద్దతు ఇస్తామన్నారు. అప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకుంటే పార్లమెంట్ చివరి రోజు 25మంది ఎంపీలతో రాజీనామా చేయిద్దామన్నారు. ఇలా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతందని... దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారుతుందన్నారు జగన్. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం పోరాటం చేస్తు మంచిదన్నారు జగన్.