//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జగన్

Category : politics state

ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడ్డ వైసీపీ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. దశమి రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదలచేశారు. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా... తొలి విడుతగా 9 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు.

ఎవరూ ఊహించని విధంగా ఈ తొలి జాబితాలో ప్రకటించిన తొమ్మిది మందిలో అత్యధికులు కొత్త మొహాలు కావడం విశేషం. ఇద్దరు మాత్రమే సిట్టింగ్ ఎంపీలు. ఏడుగురు కొత్తవారు... వారిలో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి .

ఇక అభ్యర్థుల జాబితా చూస్తే అరకు నుండి గొడ్డేటి మాధవి, అమలాపురం నుండి చింతా అనురాధ, రాజంపేట నుండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,కడప నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, హిందుపురం నుండి గోరంట్ల మాధవ్, అనంతపురం నుండి తలారి రంగయ్య, బాపట్ల నుండి నందిగం సురేష్, చిత్తూరు నుండి నల్లకొండగారి రెడ్డప్ప, కర్నూలు నుండి సంజీవ్ కుమార్ ఎంపీ బరిలో దిగనున్నారు.