//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్జీవీ "లక్ష్మీస్ ఎన్టీఆర్" ట్రైలర్ ను చూస్తున్న ... వై.ఎస్ జగన్,రాహుల్ గాంధీ

Category : movies

సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాలకు,విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన ఆర్జీవీ.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ తో పాటు తాజాగా మరో ట్వీట్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అదేంటి అంటే ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫొటోలతో కూడిన ఫన్నీ మెమెలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ప్రేక్షకులకు ఫుల్ లెన్త్ ఎంటటైన్మెంట్ అందిస్తున్నాడు.

జగన్ పాదయాత్రలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ను చూస్తున్నట్లు మెమెను పోస్ట్ చేసిన వర్మ..జగన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను చూస్తున్నంత సీరియస్ గా ఇటీవలికాలంలో దేన్నీ చూడలేదు’ అని ట్వీట్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ మెమెను పోస్ట్ చేసి..‘టీడీపీతో పొత్తుపై రెండో ఆలోచనలు ఉన్నాయా....?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ఆర్జీవీ.

సమయం దొరికితే చాలు సరికొత్త కాంట్రవర్సీ కి తెర లేపుతూ...సోషల్ మీడియాను ఫ్రీ పబ్లిసిటీ కింద వాడేస్తున్నాడు ఈ జీవి,ఆర్జీవీ.దీంతో ఈరోజు మధ్యాహ్నం నాటికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను యూట్యూబ్ లో వీక్షించిన వారి సంఖ్య ఏకంగా 16 లక్షలకు పైగా చేరుకుంది.

Related News