//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కడప లో బస్తిమే సవాల్..!

Category : politics

గత కొన్నిరోజుల ముందు కడప ఎంపీ అవినాష్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఫై తీవ్రమైన విమర్శలు చేసారు.కడప జిల్లా అభివృద్ధి కు పిసా కూడా ఇవ్వలేదు అని అయన తీవ్రం గా టీడీపీ ఫై ఫైర్ అయ్యారు.ఈ విషయం ఫై మండిపడ్డ టీడీపీ నాయకులూ మీకు దమ్ముంటే అభివృద్ధి ఫై బహిరంగంగా చర్చకు రావాలని టీడీపీ నాయకుడా సతీష్ రెడ్డి మీసం మెలేసి మరియు సవాల్ విసిరారు. దీనిపై పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

దీనిని సీరియస్ గా తీసుకున్న వైసీపీ లీడర్ అవినాష్ రెడ్డి,మేము భహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు.టైం మరియు ప్లేస్ నువ్వే చెప్పిన సరే నన్ను చెప్పమన్న సరే అని సినిమా డైలాగ్ తో దుమ్ములేపారు.ఈ చర్చకు పులివెందులలోని పూలంగల్ల సెంటర్‌ను రాజకీయ రణక్షేత్రంగా మారుస్తున్నారు.

ఫ్యాక్షన్ సినిమాలో చూసినట్టుగా ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో కడప లో రాజకీయం వేడెక్కింది.సినిమాలలో మాదిరి కత్తులతో పోరాడకున్న ,మాటల తో హీట్ పెంచుతున్నారు.

అవినాష్ రెడ్డి చర్చకు మీరు చెప్పిన సమయం కంటే గంట ముందే అక్కడకు టీడీపీ మానిఫెస్ట్ తో చేరుకుంటానని చెప్పారు. నేను ఢిల్లీ లో పార్లెమెంట్ సమావేశాలకు హాజరుకావాలి కానీ ముందు మీ చర్చకు వచ్చి నిజాలు బట్ట బయలు చేసి నేను ఢిల్లీ బయలుదేరి వెళతాను అని అవినాష్ గారు చెప్పారు. ఈ విషయం ఫై అక్కడున్న నాయకులు,పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ విషయం ఎంతవరకు పోతుందో వేచి చూడాలి.