//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్యకి లవర్ తో పెళ్లి చేయించిన వ్యక్తి !

Category : national

అప్పుడెప్పుడో శ్రీకాంత్, ఉపేంద్ర, రాశి ప్రధాన పాత్రలలో నటించిన కన్యాదానం సినిమా గుర్తుండే ఉంటుంది తన భార్యని ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు హీరో శ్రీకాంత్. కొంతలో కొంత మారినా అదే జరిగింది ఒడిశా లో కూడా.

.ఓడిశా రాష్ట్రంలోని సుందర్‌ఘడ్ జిల్లా బర్గామ్ బ్లాక్ పరిధిలోని పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో (28) అనే యువకుడు జార్సుగూడ ధేబ్బి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని మార్చి 4వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఆ యువతి బంధువులమంటూ శనివారం నాడు ముగ్గురు యువకులు పంపారాలోని టప్పూ నివాసానికి వచ్చారు. వీరిలో సుశీల్ ప్రధాన్ (21) టప్పూ భార్యకు కజిన్‌గా పరిచయం చేసుకున్నాడు.

భోజనం అనంతరం గ్రామాన్ని చూసేందుకు టప్పూతో కలిసి మిగతా ఇద్దరు యువకులు బయటకు వెళ్లగా ‘కజిన్’ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. అయితే వారు ముగ్గురూ బయటకు వెళ్లిన తర్వాత టప్పూ భార్యతో సుశీల్ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన స్థానికులు అతడిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి దేహ శుద్ధి చేశారు. దీంతో బయటకువచ్చిన టప్పూ భార్య అతడు తన ప్రేమికుడని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో మరోమార్గం లేక ఈ వివాహానికి ఒప్పుకున్నట్టు ఆమె తెలపడంతో అందరూ షాకయ్యారు.

ఈ విషయం తెలిసిన టప్పూ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆమెకు ప్రేమికుడితో మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించాడు. దీని గురించి భార్య తల్లిదండ్రులు, సోదరులుతో మాట్లాడి ఒప్పించాడు. దీంతో భార్య తరఫు బంధువులు, ఆమె ప్రేమికుడి కుటుంబ సభ్యులు శనివారం పంపారాకు చేరుకున్నారు. వారి సమక్షంలో టప్పూ తన భార్య పెళ్లిని ప్రియుడు సుశీల్ ప్రధాన్‌తో ఘనంగా జరిపించాడు. ఈ వివాహానికి వందలాది మంది హాజరై దీవించారు. అంతేకాదు గొప్ప మనసుతో వ్యవహరించిన టప్పూపై ప్రశంసలు కురిపించారు.