//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాయ్ ఫ్రెండ్ కోసం ఈ అమ్మాయి చేసింది తెలిస్తే షాకె....!

Category : world

ఎక్కడైనా అమ్మాయిలను ఇంప్రెస్ చెయ్యడానికి అబ్బాయిలు నానా తంటాలు పడతారు.. అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అబ్బాయిలను ఇంప్రెస్ చెయ్యడానికి. అదీ తాను ప్రేమించిన అబ్బాయిని ఇంప్రెస్ చెయ్యడానికి అమ్మాయిలు ప్రయత్నాలు చెయ్యడం చాలా తక్కువే అని చెప్పవచ్చు.. కానీ హాంకాంగ్ కు చెందిన ఓ అమ్మాయి చేసింది వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

తన బాయ్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చెయ్యడానికి ఏకంగా 30 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొంది. తన బాయ్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చెయ్యడానికి బెర్రీ తన 17 ఏట నుంచే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మొదలు పెట్టింది. తాజాగా ఆ యువతి వయసు 22 ఏళ్ళు. హాంకాంగ్ కు చెందిన బెర్రీ అనే యువతి బాయ్ ఫ్రెండ్ ను కలిసినప్పుడల్లా. నువ్వు ఇతర అమ్మాయిలతో పోలిస్తే. అందంగా ఉండవు.. అంటూ హేళన చేస్తూ మాట్లాడేవాడట.. దీంతో తన బాయ్ ఫ్రెండ్ కి అందంగా కనిపించాలని.. తన ముఖానికి కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం 17 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించింది.

అప్పటి నుంచి బెర్రీ బాయ్ ఫ్రెండ్ .. బెర్రీ ని "నీ ముక్కు బాగోలేదు... నీ ముఖం పెద్దగా ఉంది.. ఇలా అనేక రకాలుగా పేర్లు పెట్టడం".. బెర్రీ వాటికి సర్జరీలు చేయించుకోవడం మొదలు పెట్టింది.. దీంతో శస్త్ర చికిత్సలు చేయించుకొని.. చేయించుకొనీ అలవాటు పడి దానికి బానిసగా మారింది.. సర్జరీలు చేయించుకోక ముందు నా కూతురు చాలా అందంగా ఉంది.. ఇప్పుడు తన అందాన్ని కోల్పోయింది.. అనే బెర్రీ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

బెర్రీ ఇదే విషయం పై మాట్లాడుతూ...అతడికి అందంగా కనిపించడం కోసం ఇప్పటికి 30 సర్జరీలు చేయించుకొన్నా... ఇలా సర్జరీలు చేయించుకోవడంతో ముఖం మీద ఇంజెక్షన్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.. అందువల్ల ఇక నుంచి ఎటువంటి సర్జరీలు తన ముఖానికి చేయించుకోను అని చెబుతుంది.. అంతేకాదు.. తన పాత ముఖం తిరిగి వచ్చే అవకాశం ఉంటే బాగుండును అని బెర్రీ ఇప్పుడు బాధపడుతుంది.

Related News