Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూటు మార్చిన ముగ్గురు యంగ్ హీరోస్...!

Category : movies

విజయ్ దేవరకొండ - సాయి శ్రీనివాస్ బెల్లంకొండ - కార్తికేయ గుమ్మకొండ ఇలా మొత్తం ముగ్గురు టాలీవుడ్ లో బలంగా పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట విజయ్ దేవరకొండ సంగతి చుస్తే అర్జున్ రెడ్డితో ఇమేజ్ ని గీత గోవిందంతో మార్కెట్ ని సంపాదించుకున్న ఈ యూత్ ఐకాన్ కు బయట భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు తనను అభిమానులు ఒకే తరహా క్యారెక్టరైజేషన్ లో చూడాలనుకుంటున్నారని లెక్కలు వేస్తున్న ఇతను సబ్జెక్టు సెలక్షన్ లో వాటికే ప్రాధాన్యం ఇవ్వడం కొంత వరకు బాలన్స్ తప్పుతోంది అని చెప్పవచ్చు. తాజాగా రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ లాంటి మంచి లైన్ సైతం ప్రేక్షకులు మెప్పించేలా రూపొందలేదనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక ఇప్పుడు విజయ్ స్క్రిప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ సినిమాలతో మాస్ హీరోగా సెటిలవ్వాలని చాలా ప్రయత్నించిన మొదటి సారి రాక్షసుడు మూవీ రూపంలో పాజిటివ్ టాక్ అందుకోవడం కొంత రిలీఫ్ ని కలిగిస్తోంది. ఇలా రూట్ మార్చి ప్రయోగాలు చేస్తే ఇలాంటి ఫలితాలు ఇంకా అందుకోవచ్చు అని చెప్పవచ్చు. కాకపోతే మాస్ హ్యాంగ్ ఓవర్ తగ్గించుకుంటే బెటర్. ఇక పోతే కార్తీకేయ ఆరెక్స్ 100తో భగ్నప్రేమికుడి ఇమేజ్ తెచ్చుకున్న గుణ 369తో మాస్ బాట పట్టే ప్రయత్నం చేయడం కొంత వరకు మంచిదే. డివైడ్ టాక్ నడుస్తున్నప్పటికీ ఇందులో ఉన్న మాస్ అంశాలతో ఎమోషనల్ కంటెంట్ కాపాడుతుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే విజయ్ స్టార్ స్టేటస్ వైపు సాయి శ్రీనివాస్ డిఫరెంట్ జానర్స్ వైపు కార్తికేయ మాస్ వైపు తమ టార్గెట్ లను షిఫ్ట్ చేయడం విచిత్రమే.