//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక నుండి రైల్లో కేఎఫ్‌సీ చికెన్, పిజ్జా,బర్గర్లు

Category : business

రైల్లో ప్రయాణించే పిజ్జా,బర్గర్లు తినే ప్రియులకు శుభవార్త .ఇకపై రైల్లో కూర్చునే కేఎఫ్‌సీ చికెన్, డొమినాస్ పిజ్జా, మెక్‌డొనల్డ్స్ బర్గర్లను ఆర్డర్ ఇచ్చే సదుపాయాన్ని కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కల్పిస్తోంది. ముందుగా ఈ సదుపాయాన్ని రాజధాని, శతాబ్ధి రైళ్లలో అందుబాటులోకి తెస్తోంది. కన్ఫామ్ టికెట్ కలిగిన ప్రయాణికుడు ఐఆర్‌సిటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆర్డర్ ఇస్తే చాలు. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ సంస్థ బికనీర్‌వాలా, నిరులాస్, హల్దీరామ్, కేఎఫ్‌సీ, స్విట్జ్ ఫుడ్స్, డొమినోస్, మెక్‌డోనాల్డ్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

ఎలా బుక్ చేసుకోవాలంటే..

1. http://www.ecatering.irctc.co.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.

2. PNR నెంబరు ఎంటర్ చేసి, ఏ స్టేషన్లో మీకు ఆహారం కావాలో సూచించాలి.

3. ఆహార సంస్థను, మీకు కావాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకుని ఆర్డర్ ఇవ్వాలి.

4. పేమెంట్ మోడ్‌ను సెలక్ట్ చేసుకున్న తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ రిసిప్ట్, OTP వస్తుంది.

ఫోన్ ద్వారా కూడా ఆర్డర్ ఇవ్వొచ్చు..

1. ఫోన్ నుంచి 1323 కి కాల్ చేయాలి

2. కాల్ సెంటర్ ఎగ్జిక్యుటివ్ మీ ఆర్డర్ తీసుకుంటాడు.

3. వేరిఫికేషన్ కోసం OTP నెంబరు అందుతుంది. డెలివరీ టైమ్‌లో ఆ నెంబర్‌ను చూపించాలి.

SMSతో ఇలా..

1. MEAL అని రాసి PNR నెంబరుతో 139కు SMS చేయాలి.

2. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మీ ఆర్డర్ తీసుకుంటాడు.

3. కన్ఫర్మేషన్ రిసిప్ట్‌ను మీకు SMS ద్వారా పంపుతారు. డెలివరీ సమయంలో దాన్ని చూపించి నగదు చెల్లిస్తే సరి.