//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా మంత్రి బార్ ప్రారంభం... అయోమయంలో యోగి

Category : national politics

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద సన్యాసి. పశువధ నిషేధం అమలు కోసం ఎంతో శ్రమపడుతున్నారు. అయితే ఆయన మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి బీర్ బార్ ను ప్రారంభం చేస్తున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ వలే సంచలనం కలిగిస్తూ ఉండటంతో అయోమయంలో పడినట్లు కనిపిస్తున్నది. ఇదొక్క పెను వివాదంగా మారడంతో యోగి ప్రభుత్వం తలవంచుకో వలసి వచ్చింది. 

సాంఘిక సంక్షేమ, కుటుంభం సంక్షేమ మంత్రి స్వాతి సింగ్ బీర్ బార్ ను ప్రారంభించడం సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంటే ఇదేనా `బిజెపి అసలు రంగు' అతనూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి ఆమెను వివరణ కోరారు అనుకోండి. సోషల్ మీడియా లో వచ్చిన చిత్రాల ప్రకారం స్వాతి సింగ్ కొద్దిమంది అధికారులు, మహిళలు కలసి ఉండగా మే 20న  రిబ్బన్ కత్తిరించడం జరిగింది. బి యస్ పి మాయావతి పై అసభ్య వాఖ్యలు చేసినందుకు బిజెపి నుండి సస్పెన్షన్ కు గురైన  దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్. 

మద్యపానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో మహిళలు నిరసన ప్రదర్శనలు చేస్తున్న సమయంలో ఈ ఫోటో రావడం బిజెపి లో నెలకొన్న వైరుధ్యాలకు నిదర్శనం అని సమాజ్ వాద్ పార్టీ నేత రాజేంద్ర చౌదరి విమర్శించారు.  బిజెపి నిజమైన వ్యక్తిత్వం, ముఖాన్ని ఈ ఫోటో వెల్లడి చేస్తుందని కాంగ్రెస్ నాయకుడు ద్విజేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మధ్య నిషేధం అమలులో లేక పోవడంతో ఈ చర్య తప్పేమి కాదని బిజెపి నేత రాకేష్ త్రిపాఠి సమర్ధించుకున్నారు 

Related News