//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గమ్మత్తైనా యోగ 'బీర్ యోగా'

Category : world

'బీర్ యోగా' ఈ పేరును విన్నారా ఎపుడైనా? వింటానికే కొత్తగా ఉంది కదా ఈ పదం, వింటానికే వింతగా ఉన్న ఈ లేటెస్ట్ పిట్ నెస్ ట్రెండ్ ఫై జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా,రష్యా వంటి చాలా దేశాల యువతిలో క్రేజ్ ను పెంచుతుంది ఈ బీర్ యోగా, పతంజలి యోగా, పవర్ యోగా, విక్రమ్ యోగా, అయ్యంగార్ యోగా అంటూ ఎన్నో కొత్త రకాల యోగాలు పుట్టకొచ్చిన, ఇప్పడు బీర్ యోగా మాత్రం యువతిని ఒక ఊపు ఊపుతుంది అనుకోండి.

అసలు బీర్ యోగా ఎలా చేస్తారు? బీర్ తాగుతూ సూర్య నమస్కారాలు చేయటం, తలపై బీర్ బాటిల్ ను బ్యాలెన్స్ చేస్తూ వృక్తాసనం, పద్మాసనం, నటరాజాసనం వంటి పలు రకాల యోగా ఆసనాలు వేస్తున్నారు ఇప్పడున్న కుర్రకారులు.అత్యున్నత స్థాయి చేతనను చేరుకటానికి యోగా వేదాంతంలో బీర్ ఆహ్లాదాన్ని జత చేశామని అదే 'బీర్ యోగా' అని అంతే కాదు వారి కలయికను 'ఇద్దరు గొప్ప ప్రేమికుల పెళ్లి' అని కూడా జర్మనీకి చెందిన యోగా టీచర్లు 'ఎమాలి','ఝులా' అభివర్ణిస్తున్నారు.యోగాను ఇష్టపడే బీరు ప్రేమికులు, బీర్ ను యోగులు ఇలా ఆసక్తి ఉన్న వారందరు బీర్ యోగా చేయవచ్చుని చెపుతున్నారు బీర్ యోగా ప్రేమికులు.

బీర్ యోగా అంటే ఏమి లేదంటా మనం బీర్ తాగే విధానాన్ని యోగాసనాల్లోకి మార్చటమే బీర్ యోగా అంటుంది యోగా టీచర్ నషి వెంకటరామన్.అంతే కాదండో ఇప్పడు బీర్ యోగ మన దేశంలో కూడా విస్తరిస్తుంది, అయితే దీనిపై ప్రముఖులు స్పందిస్తూ యోగా మన సాంప్రదాయ వారసత్వం కాబట్టి బీర్ కు బదులుగా భారతీయ మద్యపానీయమైన 'భంగు'తాగుతూ యోగా చేస్తే ఉత్తమ మని సూచనలు ఇస్తున్నారు.ఏది ఏమైనా బీర్ యోగ చాల విచిత్రంగా ఉంది కదూ, ఇంకే మరి ఒక సారి మీరు ట్రై చెయ్యండి బీర్ యోగాను.