Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ షాక్ ...? టీడీపీ షేక్ ...?

Category : state politics

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యయాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ హవానే కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది.అలాంటి బలమైన పార్టీ ని కేవలం రాష్ట్ర విభజన మూలాన భూస్థాపితం చేయబడిన ఘనత ఇక్కడి స్థానిక పార్టీలది.ఇది ఇలా ఉంటె 2014 తరువాత రెండు రాష్ట్రాల్లో వేరే, వేరు గా జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ ,ఏపీ లో టీడీపీ పార్టీ లు అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు పక్కన పెడితే , ఏపీ ఎన్నికలలో మాత్రం టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ సారి ఎన్నికల్లో జనసేన ఒంటరి పోటీ మూలాన టీడీపీ పార్టీ కి అలాగే వైసీపీ కి బలమైన పోటీ అని కూడా చెప్పవచ్చు. ఈ విషయం ఇలా ఉంటె..... ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ లాభాలు ఎలా ఉన్న. జనసేన పార్టీ మాత్రం తన ప్రజా బలాన్ని మరింత బలంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది.జనసేన పూర్తి స్థాయి మెజారిటీ తో, అధికారం లోకి రాకపోయినా సరే , అంతకు మించిన ప్రజా బలంతో కింగ్ అయినా కావొచ్చు, లేదా కింగ్ మేకర్ అయినా కావొచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అంతే ధీమాతో ఉండడం విశేషం.అయితే ఏప్రిల్ 11 జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 25 నుంచి 32 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు రాజకీయ నిపుణుల యెక్క అభిప్రాయం.ఈ జాబితాలో వారు గెలవబోయే అసెంబ్లీ ,పార్లమెంట్ స్థానాల యెక్క వివరాల తో పాటు అక్కడి స్థానిక పరిస్థితులు ఒక్క సారి పరిశీలిద్దాం.....ఈ జాబితాలో గుంటూరు వెస్ట్, తెనాలి, సత్తెన పల్లి ,ప్రత్తిపాడు ,తణుకు ,తిరుపతి, తంబలా పల్లి, కావాలి, నెల్లూరు అర్బన్ , విజయవాడ ఈస్ట్ , కైకలూరు, అవని గడ్డ, కొత్త పేట, అమలాపురం, రామచంద్ర పురం, నర్సాపురం , తాడేపల్లి గూడం ,నిడదవోలు ,కురుప , నేర్లిమర్ల , గాజువాక, ఎలమంచిలి ,పీ గన్నవరం,అర్బన్ గన్నవరం , పెందుర్తి , పెడన ,పాత పట్నం ,రాజమండ్రి ,తుని , కాకినాడ రూరల్, భీమ వరం,ఇచ్చాపురం,రైల్వే కోడూరు,భీమిలి మొదలైనవి అసెబ్లీ స్థానాలు కాగా ......వాటితో పాటు విశాఖ, చోడవరం ,అనకా పల్లి ,భీమిలి ,ఎలమంచిలి వంటి స్థానాల గట్టి పోటీ తో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు ముఖ్య సమాచారం.

ఈ ఎన్నికల్లో జనసేన నాయకుడి యెక్క ప్రభావం అక్కడి స్థానిక ప్రజలపై మరింత గా ప్రభావం చూపిందనే చెప్పాలి.ఎందుకంటే తన మాటల్లో ఉండే చురుకుదనం,స్థానిక సమస్యల పట్ల తానూ చూపే చొరవ,ముందు తరాల భవిషత్తు పై తానూ ఎంచిన మార్గం.ప్రతి ఒక్కరిని ఎంతో ఆలోచింప చేయడమే ఇందుకు ప్రధాన కారణం.అలాగే ఈ ఎన్నికలపై 2009 ఎన్నికల ప్రభావం కూడా చాలానే ఉండనుంది.ఎందుకంటే అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ మొత్తంగా 18 స్థానాల్లో గెలవగా ప్రస్తుతం జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో వారి ఆశలకు జీవం పోస్తున్నది వాటి లో ఈ స్థానాలు కూడా ఉండడం విశేషం.అలాగే ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓటింగ్ పెద్ద ఎత్తున....

ఈ పార్టీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది.ఎందుకంటే జనసేన నాయకుడి పై ఆ వర్గం యెక్క ప్రభావం చాలానే ఉందని చెప్పాలి.అలాగే జనసేనకు బలాన్ని చేకూర్చుతూ ఎస్సి,ఎస్టీ ,బీసీ ఓటింగ్ సైతం జనసేన వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.ఈ తరహా ప్రాంతీయ అభిమానం తో పాటు కొన్ని సామజిక వర్గాల ఓట్లు కూడా అభిమానం కొద్దీ ఆలోచన స్థాయిని బట్టి జనసేన వైపు ప్రభావం చూపినట్టు తెలుస్తుంది.ఈ లెక్కన ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎలాంటి ప్రభావాన్ని అయినా చూపించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. అంతా అనుకున్నట్టు 20 నుంచి 30 స్థానాల్లో గెలిచినా లేక ,అంతకు మించిన స్థానాల్లో గెలిచినా పెద్దగా ఆశ్చర పోవాల్సిన పని లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.