//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నెల్లూరులో జ‌గ‌న్‌కి బిగ్ షాక్.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్.. టీడీపీలోకి వైసీపీ ఎంపీ..?

Category : politics

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల హడావుడి ఊపందుకుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగానై అధికారంలోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని జ‌గ‌న్ పాద‌యాత్ర స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ పాదయాత్ర మొదలైన సమయం నుంచీ టిడిపి అధినేత చంద్రబాబు యాత్రకి మైలేజ్ రాకుండా వైసీపి ఎమ్మెల్యేలని , కీలక నేతలని సైకిల్ ఎక్కిస్తూ జగన్ మైలేజ్‌ని అమాంతం తగ్గించుకుంటూ వచ్చారు. అయితే కొద్ది రోజుల‌గా వ‌ల‌స‌ల ప‌ర్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు బ్రేక్ ఇచ్చారు.

అయితే తాజా ప‌రిణామాలు చూస్తే చంద్ర‌బాబు మ‌రోసారి ఆప‌రేషన్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టార‌నే వార్త వైసీపీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం రేపుతోంది. అంతేకాకుండా ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేరుగా జ‌గ‌న్‌కు కంచుకోట‌గా ఉన్న నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌ధ్యంలో మొద‌ట వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ పేరు రావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఎప్ప‌టినుంచో జగన్‌కి అత్యంత ఆప్తుడుగా నెల్లూరు జిల్లా వైసీపికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయ‌న కొంత కాలంగా జగన్ పై తీవ్రమైన అసంతృప్తితో జగన్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

నెల్లూరు జిల్లా వైసీపి గెలుపులో ప్రధాన పాత్ర రెడ్డి కులస్తులదే అయితే అక్కడ..మేకపాటి ముఖ్యంగా ఇద్దరు రాజ్యసభ సభ్యుల వలన పార్టీలో ఎంతో ఇబ్బందిని ఎదుర్కుంటున్నారని టాక్ వినిపిస్తోంది. వారిలో ముఖ్యంగా జగన్‌కి అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి మ‌రొక‌రు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ ఇద్దరు కూడా జిల్లాలో గ్రూపులు కడుతూ మేకపాటి ప్రాభల్యం తగ్గించడం మేకపాటిని అనేక ఇబ్బందులకి గురిచేస్తున్నారట.అంతేకాదు నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలూ అన్నీ కూడా జగన్ వేమిరెడ్డికి ఇవ్వడంతో మేకపాటి పై ఆయన పెత్తనం చేలాయిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే ఈ పరిస్థితులు మింగుడు పడని మేకపాటి త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని స‌మాచారం. మొద‌టి నుండి పార్టీని నమ్ముకుని జగన్‌కి ఆది నుంచీ ఎంతో అండగా ఉన్న మేకపాటి ఇప్పుడు జగన్ వ్యవహార శైలిపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తోంది. అయితే ఇదే అదునుగా చంద్రబాబు మేకపాటిని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి అంటూ నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్స్‌కి బాధ్యతలు అప్పగించారట ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయాలనీ భావించినా సరే పార్టీ అంగీకారం తెలుపుతుందనే సిగ్నల్స్ ఇవ్వమని కూడా చెప్పారట చంద్రబాబు. మ‌రి మేక‌పాటి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఒక‌వేళ మేక‌పాటి టీడీపీలోకి జంప్ అయితే వైసీపీకి పెద్ద షాకే అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.