Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలిదుః ఎమ్మెల్యే రోజా

Category : politics

ఏపీ సియం చంద్ర‌బాబు పై మ‌రో్సారి ఫైర్ అయ్యారు వైసిపి ఎమ్మెల్యే రోజా. తిరుప‌తిలో టిడిపి నిర్వ‌హించిన ధ‌ర్మ‌పోరాట స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌లు వీడియోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర‌మోడీ ఇచ్చిన హామిల‌ను గుర్తు చేశారు. ఇదే విష‌యంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తిరుప‌తి వెంకన్న సాక్షిగా బీజేపీతో చంద్రబాబు స్నేహం చేశారని, తిరుపతిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు చెబుతోన్న మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. పిచ్చోడి చేతిలో రాయి, చంద్రబాబు చేతిలో మైకు ఒక్కటేనని... పిచ్చోడి చేతిలో రాయి ఉంటే విసురుతాడని, అలాగే చంద్రబాబు చేతిలో మైక్‌ ఉంటే ఆయన ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదని అన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నానని చెబుతోన్న చంద్రబాబు.. టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యను ఎలా నియమించారని రోజా ప్రశ్నించారు.

Related News