//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే !

Category : politics

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు.

కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముస్తాఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకువచ్చారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తాఫా విజయం సాధించారు. అయితే ముస్తాఫా టీడీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రస్తుతానికి తగ్గాయి. శనివారం సీఎంతో ముస్తాఫా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ముస్తాఫా చాలా చురుకుగా ఉండేవారు.

ఇటీవల ఆర్టీయే అధికారులపై టీడీపీ నేతల ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీవద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముస్తాఫా అయితే ఏకంగా గేటు ఎక్కారు.దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. గేటు దిగిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

Related News