Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైస్సార్సీపీ వర్గీయుల అరాచకాలు : 40 రోజుల్లో 6గురు టీడీపీ కార్యకర్తల హత్య

Category : politics state

టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 40 రోజుల్లో 6గురు టీడీపీ కార్యకర్తల హత్య కిరాతకమన్నారు. అన్నిచోట్ల వైసీపీ వర్గీయుల అరాచకాలు పేట్రేగాయన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలను ఖండిస్తున్నానన్నారు.

గ్రామాలు ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని.. ఇళ్లపై సామూహిక దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పొలాలు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారన్నారు. అంగన్ వాడీ భవనాలను కూలగొట్టారని... రోడ్లు తవ్వేస్తున్నారన్నారు. రోడ్లకు అడ్డంగా గోడలు కడుతున్నారని.. ఇన్ని దాడులు-దౌర్జన్యాలను రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారం అండతో అరాచక శక్తులు పేట్రేగుతున్నాయని.. కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

Related News