//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ పై వైసీపీ నేత సీరియస్ !

Category : politics

ప్రస్తుతం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రకాశం జిల్లా లో కొనసాగుతుంది . ప్రకాశం జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో ప్రకంపనలు రేపింది . దర్శి నియాజక వర్గ అభ్యర్థిని అధినేత నేరుగా ప్రకటించడం పై జిల్లా ముఖ్య నేత ఆగ్రహంతో ఉన్నారు.

తమ అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం ఎలా ప్రకటిస్తారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . అయన ఎవరో కాదు జిల్లా ముఖ్య నేత, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తనకు కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా మాధవరెడ్డిన ప్రకటించడాన్ని బూచేపల్లి తప్పుబడుతున్నారు. గతంలో తనకు, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తిని ఎలా పార్టీ అభ్యర్తిగా ప్రకటిస్తారని ఆగ్రహంతో ఉన్నారట.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. తర్వాత కొంతకాలం యాక్టివ్‌గా పనిచేసిన ఆయన, తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని కూడా ప్రకటించారు. తరువాత అనూహ్యంగా జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. అంతా మళ్లీ ఆయన రంగంలోకి దిగారని భావించారు. కాని ఎన్నికల్లో పోటీ చేయలేనని మళ్లీ జగన్‌తో చెప్పేశారు. బూచేపల్లి క్లారిటీ ఇవ్వడంతో తాళ్లూరు బహిరంగ సభలో అభ్యర్థిగా మాధవరెడ్డిని ప్రకటించేశారు. అతడ్ని ఆశీర్వదించి, మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ విషయం లో శివప్రసాద్ రెడ్డి జగన్ ఫై సీరియస్ గా వున్నాడట.పోయిన సారి పార్టీ కి వ్యతిరేకంగా పని చేసిన వారికీ ఈ సారి టికెట్ ఎలా ఇస్తారని అన్నాడట.దీనిపై అయన బాలినేనితో చర్చించారు. ఆ తరువాత శివప్రసాద్ రెడ్డి తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ముండ్లమూరులోని ఇటుకల బట్టీ దగ్గర సమావేశమయ్యారట. ఈ విషయంపై రెండు రోజుల్లో తేల్చుకుంటే భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత చెబుతాను అని అన్నారట.

Related News