//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి కీల‌క నేత‌..!

Category : politics

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌న‌సేన పార్టీలోకి ఒక కీల‌క నేత రాబోతున్నారు. ఆయ‌న అలాంటి, ఇలాంటి కీల‌క‌నేత కాదు. ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన‌కు భ‌యంక‌ర‌మైన ఊపు తీసుకొచ్చే నేత‌. వైసీపీ ఐదు జిల్లాల్లో బ‌లంగా ఉంటే తెలుగుదేశం ఎనిమిది జిల్లాల్లో బ‌లంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదంతా ఉత్త‌రాంధ్ర సంగ‌తి. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ చాలా బ‌లంగా ఉంది. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీ చాలా దూకుడు ప్ర‌ద‌ర్శించింది. అయితే, ఆ జిల్లాలో ఇప్ప‌టికే వైకాపాకు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారంటే.. అదంగా బొత్స‌వ‌ర్గ‌మ‌నే చెప్పొచ్చు. వైకాపాలో ఉన్న కొద్దిమంది కీల‌క నేత‌ల్లో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు.

అయితే, బొత్స‌ను నెమ్మ‌ది పార్టీ కార్య‌క్ర‌మాల్లో, క‌ల‌హాల్లో ప్రాముఖ్య‌త‌ను త‌గ్గించ‌డం త‌న‌కు తెలియ‌కుండా మీడియా ముందుకు వెళ్ల‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ఆదేశించ‌డంతో సీనియ‌ర్ నేత అయిన బొత్స కినుకు వ‌హించార‌ట‌. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టోట‌ల్ ఫ్యామిలీ ప్యాకేజీతో ఏలేస్తున్న బొత్స ఫ్యామిలీ అంతా కూడా గ‌త ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడారు. బొత్స‌, ఆయ‌న మేన‌ల్లు, త‌మ్ముడు, ఎంపీగా పోటీ చేసిన భార్య ఝాన్సీ ఇలా చెప్పుకుంటూ పోతే బొత‌స అనుచ‌ర వ‌ర్గాన్ని మొత్తం జిల్లా ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అత్య‌ధిక శాతం సీట్లు త‌మ అనుచ‌వ‌ర్గానికే ద‌క్కేలా బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు.

ఇలా బొత్స స‌త్య‌నారాయ‌ణ తెర వెనుక చేస్తున్న రాజ‌కీయాల‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్ ఫైర్ అయిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే 2014 ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ తిన్నాం. ఇటువంటి స‌మ‌యంలో మ‌ళ్లీ వ‌ర్గ‌పోరు తీసుకువ‌స్తావా.?? అంటూ బొత్స‌కు క్లాస్ తీసుకున్నార‌ట‌. నిన్ను పార్టీలోకి తీసుకుని పెద్ద త‌ప్పు చేశానంటూ తిట్ల‌దండ‌కం కూడా చేశార‌ట జ‌గ‌న్‌. నీవిలా చేస్తే.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీ గెలుస్తుందా..? అంటూ బొత్స‌పై జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించార‌ట‌. ఈ నేప‌థ్యంలో బొత్స కినుకు వ‌హించార‌ట‌. ఈ క్ర‌మంలోనే బొత్స స‌త్య‌నారాయ‌ణ సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్ మ‌ధ్య‌వ‌ర్తిగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌తో భేటీ అయ్యార‌ని, ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన‌కు మంచి అభ్య‌ర్థులను సూచిస్తాన‌ని, వారిని గెలిపించే బాధ్య‌త‌గా నా వంతు కృషి చేస్తాన‌ని బొత్స ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో వైసీపీ నుంచి ఓ కీల‌క నేత జ‌న‌సేన‌లోకి అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Related News