//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

80 లక్షలతో పారిపోయిన వైసీపి నేత !

Category : politics

రాజుపేటలో లక్షలాది రూపాయలు చీటీలు కట్టించుకున్న నిర్వాహకులు సొమ్మును స్వాహా చేసి పరారయ్యారు. ఇటీవల పట్టణంలో ఓ కౌన్సిలర్‌, వైసీపీ నాయకురాలు ఐపీలు పెట్టిన నేపథ్యంలో తాజా ఉదంతంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

గత మూడేళ్లుగా రాజుపేటలో రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు చీటీ పాటలు నిర్వహిస్తున్నారు. వారు దాదాపు 45 మందికి చెల్లించాల్సిన రూ.80 లక్షలు స్వాహా చేసి పరారయినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, కౌన్సిలర్‌ ప్రమీలారాణి వద్దకు వచ్చి తమ గోడు వినిపించుకున్నారు.

చీటీ నిర్వాహకుల నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించేందుకు సహకరించాలన్నారు. ఇల్లు కట్టుకుందామని కొందరు, ఆడపిల్ల పెళ్లి చేద్దామని మరికొందరు చీటీలు వేశామని, తీరా నిర్వాహకులు పరారవడంతో తమకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైందని మంత్రి రవీంద్రకు బాధితులు వేముల రాణి, సిహెచ్‌.సుజాత, తరగా లక్ష్మి, జుఝువరపు విజయలక్ష్మి, డి.లక్ష్మి, లంకా గౌరి, రాజేశ్వరి, మాగంటి వెంకటరమణ, జక్కుల సులోచన, జాస్తి కళ్యాణి తదితరులు వివరించారు.

మంత్రి రవీంద్ర, కొనకళ్ల బుల్లయ్య స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇనకుదురుపేట పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Related News