//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు..!

Category : politics

వైసీపీ 8 వ ఆవిర్భావ సభను ఢిల్లీ లో తమ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని మాటలాడిన ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ 8 వ ఆవిర్భావ సభను జరుపుకోవడం ఎంతో సంతోషకరం అని చెప్పారు.

వైసీపీ కి మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. నిరంతరం ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ వైసీపీ అని అయన గుర్తు చేసారు. ఏపీ కి తీవ్రమైన అన్యాయం జరిగిందని, జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయవలిసిన అవసరం ఉన్నదని అయన గుర్తు చేసారు.

ఈ విషయమై మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి పోరాడుతున్న పార్టీ వైసీపీ అని అయన అన్నారు. వైసీపీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజన ముందు, విభజన తరువాత ఒకే మాట మాట్లాడిన ఒకే ఒక నేత వైస్ జగన్ మోహన్ రెడ్డి అని అయన అన్నారు.

Related News