//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యామిని సాధినేని బయోగ్రఫీ.......

Category : state politics history

యామిని సాధినేని ... ఒకప్పుడు యామిని సాధినేని అంటే ఎవరో చాలా మందికి తెలియదు కానీ ఏ మధ్య కాలం లో తనదైన శైలిలో పొలిటికల్ డిబేట్స్ లో పాల్గొంటూ తన సత్తా చాటు కొంటుంది ,అనూహ్యంగా టీడీపీ పార్టీ లో చోటు దక్కించుకొని ప్రత్యర్థుల పై తనదైన శైలి లో విరుచుకు పడుతున్నది ,అటు బిజినెస్ విమెన్ గాను తన మార్క్ ను చూపించుకొంటుంది ఇప్పుడు ఈమె గురించి ఎవరికీ తెలియని విషయాలను పరిశీలిద్దాము.

బాల్యం విద్యాబ్యాసం :

యామిని సాధినేని ది గుంటూరు జిల్లా తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ,యామిని ప్రాథమిక విద్య హైదరాబాద్ లో పూర్తి చేసింది ,తర్వాత ఉన్నత చదువుల కోసం యత దేశాలలో పూర్తి చేసింది ఆమె మొదట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్ డిగ్రీ చేసింది , ఆ తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ రంగం పై ఆసక్తి తో ఆ రంగం లో అడుగు పెట్టింది అమెరికా జెర్మనీ ఆస్ట్రేలియా లాంటి దేశాలలో వైర్లెస్ కమ్యూనికేషన్ కి సంబంధించిన వివిధ కోర్స్ లను ఆమె పూర్తి చేసింది

ఉద్యోగాలు గుర్తింపు :

22 ఇయర్స్ లో నే యామిని సాధినేని హం ఆపరేటర్ ల బృందం లో ప్రముఖ పాత్ర పోషించింది ,తుపాన్ వరదల సమయం లో టెలి కమ్యూనికేషన్ పనిచేయనప్పుడు హం కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగిస్తారు ,అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాల్లో ఎలక్ట్రానిక్స్ ,వైర్లెస్ కమ్యూనికేషన్స్ ,సోషల్ సర్వీస్ రంగాలలో సేవలు చేయడం వల్లనా అంతర్జాతీయ అవార్డు ల ను అందుకున్నది యామిని ,ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ లో పనిచేసింది ,అంతేకాక వివిధ రాష్ట్రాలలో తుపాను సమయం లో హం వైర్ లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఆమె సేవలు అందించింది , ,హుద్ హుద్ ,లైలా తుపాను సమయం లో ఆమె అనేక సేవలు అందించింది ,ఇక యామిని తెలుగు ,హిందీ,తమిళ్ ,మలయాళం ,ఇంగ్లీష్ వంటి భాషలు మాట్లాడ కలదు .

బిజినెస్

ఫార్మాసిటికల్ బిజినెస్ రంగం లో తన విస్తృత మైన అనుభవం తో సొంత పరిశ్రమను స్థాపించి అనేక మంది కి ఉపాధి కలిగించడం ద్వారా విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా మారింది ,తక్కువ కాలం లోనే 6కోట్ల టర్నోవర్ సాధించింది,పలు రాష్ట్రాలలో అనేక ప్రాజెక్ట్ లను మొదలు పెట్టింది ,తన నైపుణ్యం తో పారిశ్రామిక రంగంలో తన సత్తా చాటుకొంది యామిని ,అంతేకాక అనేక స్త్రీ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నది ,వివిధ దేశాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ,సెలెబ్రిటీలతో ఆమె మన్నన పొందినది.

చంద్రబాబు తో పరిచయం :

యామిని సమాచార ,సాంకేతిక ,పౌరశక్తి ,విజ్ఞాన , పార్మాసిటికల్స్ ,ఇలా అన్ని రంగాలలో సేవలు అందించడానికి శ్రేయం అనే సంస్థను స్థాపించినది ,మరోవైపు టెక్నాలిజీకి పెద్ద పీట వేసే చంద్రబాబు నాయుడు యామిని సేవలను ఉపయోగించుకున్నారు .ఈమె ఆంధ్రప్రదేశ్ నైపుణ్య మరియు పారిశ్రామిక ఫోరమ్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు ,సమాచార సాంకేతిక పరికజ్ఞానం తో అభివృద్ధి ప్రణాళిక ను అనుసంధానం చేసే బాధ్యతను బాబు ఆమెకు అప్పచెప్పారు ,ఐటీ ఇంఫ్రోస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రము లో 75వేలకుపైగా ఫైబర్ గ్రిడ్ ని ఏర్పాటు చేసింది శ్రేయం గ్రూప్ ,నెల్లూరు నగరం లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు శ్రేయం గ్రూప్ సహకరించి ఇలా చంద్రబాబు తో యామిని కి పరిచయమైంది.

రాజకీయా ప్రవేశం :

మొదటి నుండి యామిని కి టీడీపీ పట్ల సానుకూలత ఉండేది. అదే ఆమెను టీడీపీ లో చేరేలా చేసింది ,టీడీపీ లో బలమైన గళం కల మహిళా నాయకురాలు వుండాలని చంద్రబాబు ఆమెను టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించారు ,అప్పటి వరకు ఎవరికీ తెలియని యామిని పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శల వల్ల ఒక్కసారి పాపులర్ అయిపోయింది .తుపాను సమయం లో విద్యుత్ పై యూ పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు ఆధారాలతో సహా చూపించి మరింత వార్తల్లోకి ఎక్కారు ,వైయస్ జగన్ తర్వాత కెసిఆర్ పై విమర్శలు చేస్తూ ఒక పార్టీ కె పరిమితమైంది ,అంతర్జాతీయం గా గుర్తిపు వున్న యామిని టీడీపీ పార్టీ తరపున ప్రతిపక్షాల పై విమర్శలు చేస్తూ తన స్థాయిని తానే దిగజార్చుకోంధీ అనే కొంతమంది ఊహాగానాలు .

వివాహం: యామిని కి చిన్న వయసులోనే పెళ్లి అయింది ,భర్త పేరు కిషోర్ బాబు తనకి ఇద్దరు పిల్లలు ,చిన్న వయసులోనే పెళ్లి కావడం తో ఆమె యంగ్ ల కనిపిస్తారు ,ఇటు బిజినెస్ రంగం లో ను ,రాజకీయ రంగం లోను చిన్న వయసులోనే తనదైన శైలి దూసుకెతుంది యామిని .

కంక్లూషన్ :అతి చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ బహుమతులు ఎన్నో అందుకొన్న యామిని సాదినేని ఒక తల్లి లా ఒక బిజినెస్ విమెన్ గా ,తనదైన వాగ్దాటితో పారిశ్రామిక రాజకీయ రంగాలలో ముందుకెళ్తుంది యామిని .జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన యామిని మునుముందు ఇంకా మంచి అవరోధాలను అధిరోహించాలని కోరుకొందాం